Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్పత్తి- సాంకేతిక ఆవిష్కరణలతో భారతీయ ద్విచక్ర ఈవీ మోటర్‌బైక్‌ మార్కెట్‌లో సమూల మార్పులను తీసుకురానున్న మ్యాటర్‌

Bike
, బుధవారం, 11 జనవరి 2023 (21:27 IST)
ఆవిష్కరణ ఆధారిత సాంకేతిక స్టార్టప్‌, మ్యాటర్‌ తమ భావితరపు ఈవీలను, కాన్సెప్ట్‌లను ఆటో ఎక్స్‌పో 2023 వద్ద ప్రదర్శించింది. అభివృద్ధి చెందుతున్న భారతీయ యువత అవసరాలకు తగినట్లుగా, ఈ కంపెనీ ఇప్పుడు సాంకేతిక, ఇంజినీరింగ్‌, డిజైన్‌ అవసరాలకు సరిపోయేలా వైవిధ్యమైన ఉత్పత్తులు, పర్యావరణ అనుకూల పరిష్కారాలతో భారతదేశాన్ని పూర్తి విద్యుత్‌ వాహన భవిష్యత్‌ దిశగా తీసుకువెళ్లడానికి తమ నిబద్ధతను చాటి చెబుతుంది.
 
భారతదేశంలో మొట్టమొదటిసారిగా గేర్డ్‌ విద్యుత్‌ మోటర్‌బైక్‌, 6 కిలోవాట్‌ వేరియంట్‌ మ్యాటర్‌ బైక్‌. దీనిని వినూత్నమైన మ్యాటర్‌ బైక్‌ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించడంతో పాటుగా రెండు గంటల లోపు వేగవంతమైన చార్జింగ్‌ సదుపాయాలతో మెరుగైన శ్రేణి అందిస్తుంది. ఈ నూతనంగా ఆవిష్కరించిన బైక్‌ ధర, భారతదేశపు  మార్కెట్‌లో ముందస్తు ఆర్డర్లు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యేది త్వరలోనే కంపెనీ వెల్లడించనుంది.
 
ఇటీవలి కాలంలో విద్యుత్‌ వాహన పరిశ్రమను చక్కగా ఆదరిస్తున్నారు; అయితే, విప్లవాత్మక ఆవిష్కరణలు, వైవిధ్యమైన ఉప విభాగాల పరంగా ఉత్పత్తి వైవిధ్యత మాత్రం ఇంకా వెలుగుచూడాల్సి ఉంది. సుదీర్ఘకాలంగా మోటర్‌బైక్‌ విభాగంలో ఉన్న ఈ అంతరాలను పూరించడం మ్యాటర్‌ లక్ష్యంగా చేసుకుంది. ఈ గ్రూప్‌ స్థిరంగా ఆవిష్కరణలపై పనిచేయడంతో పాటుగా విప్లవాత్మక మార్పులను భారతదేశంలో తీసుకురావడానికి కృషి చేస్తుంది. మరీముఖ్యంగా రైడర్‌ల వైవిధ్యమైన అవసరాలు తీర్చడం లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా ప్రవేశ దశ, ఎగ్జిక్యూటివ్‌, ప్రీమియం దశ మార్కెట్‌ అవసరాలను తీర్చనుంది.
 
ఈవీలకు సమూలమైన మార్పులను తీసుకురావాలనే లక్ష్యంతో, మ్యాటర్‌ ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేయడంతో పాటుగా ఈ కంపెనీ గత సంవత్సర కాలంగా రెండు సాంకేతిక నేపధ్యాలపై తీవ్రంగా కృషి చేస్తుంది. అవి కాన్సెప్ట్‌ ఈఎక్స్‌ఈ, కాన్సెప్ట్‌ యుటి. ఈ రెండూ కూడా మూసధోరణులను అడ్డుకోవడంతో పాటుగా ఈవీల ద్వారా భారతదేశంలో మొబిలిటీ వ్యవస్థను సమూలంగా మార్చనుంది.
 
ఈ సందర్భంగా మ్యాటర్‌ ఫౌండర్‌, గ్రూప్‌ సీఈఓ మొహాల్‌ లాల్‌భాయ్‌ మాట్లాడుతూ, ‘‘ఆటో ఎక్స్‌పో 2023 వద్ద మా నూతన సాంకేతిక ఆఫరింగ్స్‌ను ప్రదర్శిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మ్యాటర్‌ వద్ద మేము 22వ శతాబ్దపు సాంకేతికతలను నేడే సస్టెయినబల్‌ శక్తితో సృష్టించగలమని నమ్ముతుంటాము. ఈ లక్ష్యానికి అనుగుణంగా, మేము స్థిరంగా వినియోగదారుల లక్ష్యిత, సాంకేతిక ఆధారిత ఉత్పత్తులను, వినూత్నమైన పరిష్కారాలను మొబిలిటీ, విద్యుత్‌ విభాగాలకు అందించనున్నాము. ఈ ఆవిష్కరణలతో, మోటర్‌బైక్స్‌ విభాగంలో అన్ని అంశాలనూ కవర్‌ చేయనున్నాము. నూతన సాంకేతికతల ఆవిష్కర్తగా, మా లక్ష్యం ఎప్పుడూ కూడా మూసధోరణులను అడ్డుకోవడం, భారతదేశంలో విద్యుత్‌ మోటర్‌బైక్‌లను వినియోగిస్తున్న తీరును గణనీయంగా మార్చడం. పూర్తి పర్యావరణ అనుకూలమైన భావితరపు పరిష్కారాలను ప్రతి రైడర్‌కూ అందించేందుకు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండియన్‌ కలినరీ ట్రెజర్స్‌ హంట్‌‌ను నిర్వహించబోతున్న షెరటన్‌ హైదరాబాద్‌ హోటల్‌