కొత్త యేడాది కానుకగా గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. ప్రతి 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరపై రూ.14.50 పైసలు చొప్పున చమురు కంపెనీలు ధరలు తగ్గించాయి. ఈ మేరకు గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. తగ్గిన గ్యాస్ ధరలతో 2025 జనవరి ఒకటో తేదీన సిలిండర్ ధర రూ.,1804కు చేరుకుంది. అలాగే, దేశ రాజధాని ఢిల్లీ, ముంబై తదితర మెట్రో నగరాల్లో తగ్గిన ధరల వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలో రూ.1804గా ఉంటే, ముంబైలో రూ.1756గాను, చెన్నైలో రూ.1966గాను, కోల్‌కతాలో రూ.1911గా ఉంది.
కాగా, గత 2024 డిసెంబరులు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచనున్నట్టు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. కానీ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడంతో జనవరి ఒకటో తేదీ నుంచి ధరలు తగ్గాయి. ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ధరల సవరించి ఉంటుందని గతంలో ప్రకటించిన కంపెనీలు ఆగస్టు 2024 నుంచి ధరలు పెంచుతూ వస్తున్నాయి. జనవరి 2025 నుంచి ధరలు పెరగాల్సి ఉంది. అయితే, అంతర్జాతీయ ఆయిల్ ధరలు తగ్గడం వల్ల ప్రస్తుతం ధరలు తగ్గడం గమనార్హం.