Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బేగంపేట్ స్టోర్‌లో ప్యాట్ కమ్మిన్స్‌తో కలిసి కారెరా ఐవేర్‌ను విడుదల చేసిన లైఫ్ స్టైల్

Advertiesment
Pat Cummins

ఐవీఆర్

, బుధవారం, 1 మే 2024 (21:12 IST)
భారతదేశంలోని ప్రముఖ ఫ్యాషన్ డెస్టినేషన్‌లలో ఒకటైన లైఫ్‌స్టైల్, హైదరాబాద్ లోని బేగంపేట్ స్టోర్‌లో కారెరా ఐవేర్‌ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఇది భారతదేశ వ్యాప్తంగా లైఫ్‌స్టైల్‌లో బ్రాండ్ యొక్క అరంగేట్రంను సూచిస్తుంది. ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్, కారెరా బ్రాండ్ అంబాసిడర్- పాట్ కమ్మిన్స్ చేత ఇది ప్రారంభించబడింది. ఇనార్బిట్ స్టోర్‌లో కూడా ప్రత్యేకంగా కమ్మిన్స్ కనిపించారు, లైఫ్‌స్టైల్‌లో కారెరా ఆవిష్కరణకు మరింత  ఉత్సాహాన్ని తీసుకువచ్చారు.
 
ఈ ఉత్తేజకరమైన ఆవిష్కరణతో, లైఫ్‌స్టైల్ తన పోర్ట్‌ఫోలియోకు మరో ఎలైట్ బ్రాండ్‌ని జోడించింది, ఇప్పుడు 150కి పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ల విభిన్న శ్రేణిని ఇది కలిగి ఉంది. వీటిలో, సన్ గ్లాసెస్ కేటగిరీలో టామీ హిల్‌ఫిగర్, గెస్, పోలీస్, మైఖేల్ కోర్స్, రే-బాన్, కల్విన్ క్లైన్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి బ్రాండ్‌లు ఉన్నాయి. విభిన్న రకాల అభిరుచులు, ప్రాధాన్యతలకు తగినట్లుగా విస్తృతమైన అవకాశాలను నిర్ధారిస్తుంది.
 
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన కళ్లజోడు బ్రాండ్‌లలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన కారెరా ఐవేర్, అధిక-నాణ్యత, ధరించేవారికి తేలికైన అనుభవాన్ని అందించడంతో పాటుగా గర్వాన్ని అందిస్తుంది. విలక్షణమైన డిజైన్‌లు, శ్రేష్ఠత పట్ల అచంచలమైన నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన కారెరా, భారతదేశంలో లైఫ్‌స్టైల్ యొక్క ఫ్యాషన్ ఆఫర్‌లను మరింత మెరుగుపరుస్తూ, ఆకట్టుకునే స్టైలిష్ సన్‌గ్లాసెస్, రోజువారీ కళ్లద్దాలను పరిచయం చేసింది.
 
లైఫ్‌స్టైల్ తన కస్టమర్‌లకు అత్యుత్తమ బ్రాండ్‌లను అందించడానికి కట్టుబడి ఉంది. సాటిలేని షాపింగ్ ప్రయాణాన్ని నిరంతరంగా క్యూరేట్ చేస్తుంది. తాజా ట్రెండ్‌లను తీసుకురావటం ద్వారా, లైఫ్‌స్టైల్ తన కస్టమర్‌లకు ప్రపంచంలోని అత్యంత గౌరవనీయమైన, ప్రత్యేకమైన ఫ్యాషన్, కళ్లద్దాల లేబుల్‌లను పొందగలరని హామీ ఇస్తుంది.
 
ఈ ప్రారంభం గురించి లైఫ్‌స్టైల్ మార్కెటింగ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ రోహిణి హల్డియా మాట్లాడుతూ, “హైదరాబాద్‌లోని మా లైఫ్‌స్టైల్ స్టోర్ ద్వారా భారతదేశంలోని మా కస్టమర్‌లకు కారెరా ఐవేర్‌ను పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నాము. కారెరా యొక్క స్పోర్ట్స్ హెరిటేజ్ మరియు ఫ్యాషన్-ఫార్వర్డ్ డిజైన్‌ల సమ్మేళనం సరికొత్త ట్రెండ్‌లు, ప్రీమియం బ్రాండ్‌లను అందించాలనే లైఫ్‌స్టైల్ యొక్క నిబద్ధతతో సంపూర్ణంగా సమలేఖనం చేయబడింది. కళ్లజోడులో స్టైల్ మరియు ఫంక్షనాలిటీ రెండింటినీ కోరుకునే మా కస్టమర్‌ల నడుమ కారెరా గట్టిగా ప్రతిధ్వనిస్తుందని మేము నమ్ముతున్నాము" అని అన్నారు. 
 
ఆస్ట్రేలియన్ క్రికెటర్ పాట్ కమ్మిన్స్ మాట్లాడుతూ, “లైఫ్‌స్టైల్‌ వద్ద కారెరా అందుబాటులోకి వస్తోన్న వేళ, ఈ ప్రయాణంలో నేను భాగమైనందుకు థ్రిల్‌గా ఉన్నాను. హద్దులు అధిగమించటంలో కారెరా వారసత్వం, శ్రేష్ఠత పట్ల దాని నిబద్ధత నాతో లోతుగా ప్రతిధ్వనిస్తుంది. లైఫ్ స్టైల్ యొక్క వినియోగదారులు కారెరా యొక్క ఐకానిక్ కళ్లజోడును స్వీకరిస్తారని, ప్రత్యేకంగా నిలబడటానికి ధైర్యం చేసే వారి కోసం రూపొందించబడిన వీటిని ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను.." అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ చేవెళ్ల అభ్యర్థుల్లో అధిక సంపన్నుడు ఎవరో తెలుసా?