Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబైలో కొత్త ఉత్పత్తి ఆవిష్కరణలతో సిద్ధమైన ఎల్‌ఈడీ ఎక్స్‌పో 2024

Led

ఐవీఆర్

, సోమవారం, 15 ఏప్రియల్ 2024 (23:12 IST)
ముంబై, బాంద్రాలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మే 9 నుండి 11 వరకు జరగనున్న LED ఎక్స్‌పో 27వ ఎడిషన్‌కు సర్వం సిద్ధం అయ్యింది. కొత్తగా పాల్గొనే 49 కంపెనీలు, అనేక కొత్త ఉత్పత్తి ఆవిష్కరణలతో సహా 185+ ఎగ్జిబిటింగ్ కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయించనున్నాయి. ముంబై నగరంలో నిర్వహించబడనున్న LED ఎక్స్‌పో 2024, లైటింగ్ పరిశ్రమ నిపుణుల కోసం సరికొత్త ఆవిష్కరణలు, విజ్ఞానం పంచుకోవటం, నెట్‌వర్కింగ్ కోసం సిద్దమైనది. తప్పనిసరిగా సందర్శించాల్సిన ట్రేడ్ ఫెయిర్‌గా ఇది నిలుస్తుంది. మూడు రోజుల ట్రేడ్ ఫెయిర్‌లో అరిహంత్ లైటింగ్ సొల్యూషన్స్, అస్మోన్ ఇండస్ట్రీస్, బ్యాగ్ ఎలక్ట్రానిక్స్ & టెక్నాలజీ, గ్రీన్ సర్ఫర్, హన్స్ ఎంటర్‌ప్రైజెస్, నెప్ట్యూన్ లైట్స్, ఆప్టిక్స్ మెకాట్రానిక్స్, ప్రైడ్ లైటింగ్, పవర్ పాలాజ్జో, సైనీ స్ట్రోకండక్టర్స్, సైనీ స్రెక్‌ట్రానిక్‌డక్ట్స్ వంటి బ్రాండ్‌లతో పాటు డెమాక్ ఇటలీ, రేరన్ ఇంటర్నేషనల్, ఫెర్రిక్స్ మరియు ఎటన్ మెషీన్స్ వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లు షో ఫ్లోర్‌కు గ్లోబల్ టచ్‌ని జోడిస్తాయి.
 
భారత ప్రభుత్వ వాణిజ్యం & పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖల  మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ “ఉజాలా పథకం, LED స్ట్రీట్ లైటింగ్ నేషనల్ ప్రోగ్రామ్ (SLNP) దేశవ్యాప్తంగా ఇంధన-సమర్థవంతమైన లైటింగ్ పరిష్కారాలను స్వీకరించడాన్ని గణనీయంగా బలపరిచాయి" అని అన్నారు. ఎల్‌ఈడీ ఎక్స్‌పో ముంబై 2024ను అభినందిస్తూ, “మెస్సే ఫ్రాంక్‌ఫర్ట్ ట్రేడ్ ఫెయిర్స్ ఇండియా ఎల్‌ఈడీ ఉత్పత్తుల స్వదేశీకరణను ప్రోత్సహించడానికి మరియు శక్తి సామర్థ్యానికి సంబంధించిన సందేశాన్ని ప్రచారం చేయడానికి , వినూత్న మార్గాలను ప్రోత్సహించడానికి అంకితభావంతో చేస్తున్న కృషి అభినందనీయం. ఈ ఎక్స్‌పో వాటాదారులకు కలిసి రావడానికి, ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి, పురోగతిని ప్రదర్శించడానికి మరియు LED పరిశ్రమ యొక్క వృద్ధి , స్థిరత్వానికి మరింత దోహదపడటానికి ఒక ఆదర్శ వేదికగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను..." అని అన్నారు.
 
మెస్సే ఫ్రాంక్‌ఫర్ట్ ఆసియా హోల్డింగ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బోర్డ్ మెంబర్ శ్రీ రాజ్ మానెక్ మాట్లాడుతూ: “ఎల్‌ఈడీ ఎక్స్‌పో ప్రతి ఎడిషన్‌తో పాటు కొత్త, ఉత్తేజకరమైన ఆవిష్కరణలను చేస్తూనే ఉంది. మా ఎగ్జిబిటర్లందరి అచంచలమైన నమ్మకం, ప్రదర్శన జరిగే మూడు రోజులూ కొత్త ఉత్పత్తిని ఆవిష్కరించటం, పరిశ్రమ లక్ష్యంగా చేసుకున్న కొనుగోలుదారులు, సరఫరాదారులను చేరుకోవడానికి సరైన వేదికగా ప్రదర్శనను నిలిపింది..." అని అన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒపీనియన్ పోల్స్: టీడీపీకి 18, వైసీపీకి 7.. మహా కూటమికి గెలుపు ఖాయం