సెలవు పెడితే కోట్లు పోవడమేంటని ఆలోచిస్తున్నారా, నిజమేనండీ బాబు.. ప్రముఖ సంస్థ ఎల్&టి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పని చేసిన అనిల్ కుమార్ మనిభాయ్ నాయక్ ఇటీవల పదవీ విరమణ పొందగా ఆయనకు రిటైర్‌మెంట్ క్రింద సుమారు 2.7 కోట్ల రూపాయలను అందించడం జరిగింది. కానీ ఇంతకంటే భారీ మొత్తంలో అక్షరాలా 19.4 కోట్ల రూపాయలు ఆయనకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌లో లభించింది.
అనిల్ కుమార్ 1965లో జూనియర్ ఇంజినీర్‌గా ఇందులో చేరారు. ఆ తర్వాత పట్టుదలతో కష్టపడి పని చేసి అంచలంచెలుగా ఎదుగుతూ ఛైర్మన్ హోదాను సంపాదించుకున్నారు. దాదాపు 50 ఏళ్ల కార్యాలయ జీవితంలో ఈయన సెలవు పెట్టిన సందర్భాలు చాలా చాలా తక్కువ. ఎప్పుడూ పీకల్లోతు పనిలో మునిగి ఉండే ఈయన బిజీగా ఉండేవాడు. దీంతో సెలవులన్నీ అలాగే మిగిలిపోయాయి.
ఇప్పుడు రిటైర్‌మెంట్ టైమ్‌లో లీవులను ఎన్‌క్యాష్ చేయడానికి లెక్కకట్టగా మొత్తంగా 19.4 కోట్ల రూపాయలుగా తేలింది. కమిట్‌మెంట్‌తో పనిచేస్తే ఆత్మ సంతృప్తే కాదు లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుందని ఆయన నిరూపించారు.