పోస్ట్ ఆఫీస్‌లలో ఎన్నో రకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి స్కీమ్‌లలో ఒకటి కిసాన్ వికాస్ పత్ర స్కీమ్. ఇక కిసాన్ వికాస్ పత్రం స్కీమ్ డబ్బులను రెట్టింపు చేసే స్కీమ్ అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఒక వేళ ఈ స్కీమ్‌లో మీరు చేరి డబ్బులు పెట్టినట్లయితే ఆ డబ్బు పూర్తిగా రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది.
అంతేకాదండోయ్ దీనికిగాను పూర్తి గ్యారెంటీ కూడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మీ డబ్బుకు హామీ కూడా లభిస్తూ ఉంటుంది. ఇప్పటికే ఎంతోమంది ఇలాంటి స్కీమ్‌లలో డబ్బులు పెట్టిన వారు కూడా ఉన్నారు. అందుకే ఎక్కువ డబ్బులు పెట్టాలనుకున్నప్పుడు బ్యాంకుల్లో కాకుండా పోస్ట్ ఆఫీస్ కెవిపి స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చునని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు.
కిసాన్ వికాస్ పత్రం స్కీమ్‌లో డబ్బులు పెడితే నూట ఇరవై నాలుగు నెలల్లో మీ డబ్బులు రెట్టింపు అవుతాయి. ఇక ఈ స్కీమ్‌లో భాగంగా 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. అయితే ఈ స్కీమ్‌లో భాగంగా ఎవరైనా సరే ఒకేసారి 5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.
మెచ్యూరిటీ సమయానికి మీరు ఎంత మొత్తం అయితే డబ్బులు పెట్టుబడి పెట్టారో అంత మొత్తం డబ్బులు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒక లక్ష ఇన్వెస్ట్ చేసినప్పుడు మెచ్యూరిటీ కాలం పూర్తయిన తర్వాత రెట్టింపుగా రెండు లక్షలు పొందే అవకాశం ఉంటుంది. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అనే చెప్పాలి. ఒకసారి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ కాలం వరకు వేచి చూడాల్సి ఉంటుంది.