Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీకి టాటా చెప్పనున్న 'కియా' మోటార్?!

ఏపీకి టాటా చెప్పనున్న 'కియా' మోటార్?!
, గురువారం, 6 ఫిబ్రవరి 2020 (13:03 IST)
KIA logo
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వచ్చిన కార్ల ఉత్పత్తి సంస్థ కియా త్వరలోనే మరో రాష్ట్రానికి తరలిపోనున్నట్టు తెలిస్తోంది. ఈ మేరకు ఓ అంతర్జాతీయ మీడియాలో ఓ కథనం ప్రచురితమైంది. ఇప్పటికే తరలింపు ప్రక్రియపై తమిళనాడు ప్రభుత్వ అధికారులతో కియ యాజమాన్యం సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆ కథనం సారాంశం. 
 
రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో పారిశ్రామిక రాయితీలపై... ప్రభుత్వం పునరాలోచన చేయటమే తరలింపునకు కారణమంటూ కథనంలో పేర్కొన్నారు. కియ పరిశ్రమకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పలు రాయితీలు ఇచ్చింది. ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం పలు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. చివరకు ఏపీలో పరిశ్రమ ఏర్పాటుకు కియ మొగ్గు చూపింది. ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా 15 వేల మందికి.. పరోక్షంగా మరో 40 వేల మందికి లబ్ధి చేకూర్చనుంది.
 
అయితే, కియ పరిశ్రమకు ఇచ్చిన రాయితీలపై జగన్ సర్కారు సమీక్షించనున్నట్టు వార్తలు వచ్చాయి. పైగా, స్థానిక వైకాపా నేతల ఆగడాలు కూడా ఎక్కువయ్యాయి. కియా పరిశ్రమలోని ఉద్యోగాల్లో స్థానికులకే 75 శాతం ఇవ్వాలని ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. వీటన్నింటిపై గతంలోనే కియ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. పరిశ్రమల్లో 75శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని... ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా మరో కారణమని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడు ముక్కలైన విమానం... ప్రయాణికులంతా క్షేమం?