Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ 2026-27 ముఖ్యాంశాలు...

Advertiesment
budget 4
దేశంలో ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ కోసం 4 రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ మేరకు బడ్జెట్‌ ప్రసంగంలో ఆమె పేర్కొన్నారు. ఏపీ, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో ప్రత్యేక మైనింగ్‌ మిషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రపంచస్థాయి కంటెయినర్‌ ఉత్పత్తి కార్పొరేషన్‌ నెలకొల్పుతామని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఆమె బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే, 
 
బయో ఫార్మా రంగానికి రూ.10 వేల కోట్లు
ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళలో గనుల కారిడార్
మూడు డెడికేటెడ్ కెమికల్ పార్క్‌ల నిర్మాణం
ప్రస్తుతమున్న ఎన్.ఐ.పి.ఈ.ఆర్‌ల ఆధునీకరణ
దేశంలో 2 హైటెక్ టెక్నాలజీ రూమ్స్‌ ఏర్పాటు
కంటైనర్ నిర్మాణ రంగానికి రూ.10 వేల కోట్లు
దేశంలో కొత్తగా మూడు కెమికల్ రీసెర్చ్ పార్కులు
సెమీకండక్టర్ మిషన్ కోసం రూ.40 వేల కోట్లు
జౌళి రంగానికి కేంద్ర బడ్జెట్‌లో చేయూత
మెగా టెక్స్‌టైల్ పార్క్‌ నిర్మాణం
సెమీ కండక్టర్ మిషన్ 2.O ప్రారంభం
త్వరలో నేషనల్ ఫైబర్ స్కీమ్ ప్రారంభం
టెక్స్‌టైల్‌ రంగం అభివృద్ధికి కొత్త పథకం
దేశంలో కొత్త మెగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు
ఖాదీ, హ్యాండ్లూమ్‌, హస్తకళల ప్రోత్సాహానికి పథకం
అత్యంత నాణ్యత కలిగిన క్రీడా వస్తువుల తయారీకి పథకం
200 పారిశ్రామిక క్లస్టర్స్‌ ఆధునీకరణకు చేయూత
ఆత్మనిర్భర్‌ భారత్‌కు రూ.2 వేల కోట్లు
ఎస్ఎంఈ రంగానికి రూ.10 వేల కోట్లు
మైక్రో సెక్టార్‌కు రూ.2 వేల కోట్లు
ఆత్మనిర్భర్‌ భారత్‌కు రూ.2 వేల కోట్లు
మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ ఇనిషియేటివ్ పథకం
ఖాదీ, చేనేత, హస్త కళల రంగాలకు ప్రోత్సహకాలు
స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్ మద్దతు
ఖాదీ, చేనేత, హస్త కళల్లో యువతకు నైపుణ్య శిక్షణ, నాణ్యత ప్రమాణాలు పెంచటం
ఒక జిల్లా ఒక వస్తువు (వనర్ డిస్ట్రిక్ వన్ ప్రొడక్ట్) కార్యక్రమం
గ్రామీణ కార్మికులు, యువతకు శిక్షణ
కంటైనర్ల తయారీ కంపెనీలకు 10 వేల కోట్ల రూపాయలు
పోర్టులు, రైల్వే కనెక్టివిటీ కింద ఈ నిధులు
తీర ప్రాంతాల్లో పోర్టులు బలోపేతం చేయటం, షిప్పింగ్ వాటా పెంపునకు చర్యలు
వారణాసి, పాట్నాలో ఓడల మరమ్మతు కేంద్రాలు ఏర్పాటు
రాబోయే 5 ఏళ్లల్లో కంటైనరీ తయారీ పరిశ్రమలకు ప్రోత్సహకం కింద ఈ నిధుల వినియోగం
AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం అంచనాపై హై లెవల్ స్టాండింగ్ కమిటీ
ఏయే రంగాలపై AI ప్రభావం ఎంత అనేది పరిశీలన
ఉద్యోగాలపై AI ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశంపై సర్వే
AIపై ఉన్నత స్థాయి స్టాడింగ్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశ చరిత్రలో తొలిసారి: ఆదివారం బడ్జెట్ ప్రసంగం... నిర్మలమ్మ ఖాతాలో ఆ ఘనత