Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌లో బ్రాంచ్‌ను ప్రారంభించిన జెఎం ఫైనాన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్

image
, శుక్రవారం, 8 డిశెంబరు 2023 (21:47 IST)
జెఎం ఫైనాన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ తమ పునరుద్ధరించిన హైదరాబాద్ శాఖను ఈరోజు  ప్రారంభించింది. ఈ శాఖను ఈక్విటీ సీనియర్ ఫండ్ మేనేజర్ శ్రీ అసిత్ భండార్కర్, స్ట్రాటజిక్ అలయన్స్ డైరెక్టర్ శ్రీ మనీష్ శర్మ, దక్షిణ జోనల్ హెడ్ శ్రీమతి జ్యోత్స్నా కులకర్ణి, ఎపి&తెలంగాణ రీజనల్ హెడ్ విజయ్ దినకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ యొక్క అభివృద్ధి చెందుతున్న ఆర్థిక రంగం పట్ల సంస్థ యొక్క నిబద్ధతను సూచిస్తుంది.
 
'ముత్యాల నగరం'గా పేరొందిన హైదరాబాద్, తెలంగాణకు టెక్నో-సావీ రాజధానిగా నిలుస్తోంది. విస్తృత శ్రేణి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చెందుతున్న ముత్యాల పరిశ్రమతో, నగరం "సైబరాబాద్" వేగవంతమైన ఆర్థిక వృద్ధికి ఉదాహరణగా ఉంది. ఈ సందర్భంగా జెఎం ఫైనాన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ ఈక్విటీ సీనియర్ ఫండ్ మేనేజర్ అసిత్ భండార్కర్ మాట్లాడుతూ “అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ యొక్క AUM వృద్ధి 2021 మార్చిలో దాదాపు  ₹66K కోట్ల నుండి సెప్టెంబర్, 2023కు 90 వేల కోట్లకు పెరిగింది,  మొత్తం 35% వృద్ధిని సాధించింది. ఈ నగరం దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద మార్కెట్లలో ఒకటి. ఈ కంపెనీ తాజాగా కొద్ది మంది కొత్త సభ్యులను నియమించుకుంది. హైదరాబాద్‌ మార్కెట్‌కు మరింత బలం జోడించటానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంది ..." అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సర్కారు గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల