Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అతిపెద్ద 28 ఛార్జీ పాయింట్లతో EV ఛార్జింగ్ సమీకృత మొబిలిటి కేంద్రాన్ని ప్రారంభించిన జియో-బిపి

Advertiesment
image

ఐవీఆర్

, గురువారం, 30 అక్టోబరు 2025 (22:23 IST)
బెంగళూరు: బెంగళూరులోని దేవనహళ్లిలో రిటైల్ అవుట్ లెట్ లో 28 EV ఛార్జింగ్ పాయింట్లతో భారతదేశంలో మొదటి, అతి పెద్ద సమీకృత మొబిలిటీ కేంద్రాన్ని ప్రారంభించినట్లు జియో-బిపి ఈరోజు ప్రకటించింది. ఇది దేశం పరిశుభ్రమైన, స్మార్ట్ ప్రయాణం దిశగా దేశం యొక్క పరివర్తనలో ఒక ప్రధానమైన మైలురాయిని సూచిస్తుంది.
 
దేవనహళ్లి అవుట్ లెట్ బహుళ-ఇంధనం రిటైల్ సైట్. ఇది పెట్రోలు, డీజిల్, CNGని అందిస్తుంది. వైల్డ్ బీన్ కేఫ్. ఇది ఇప్పుడు ఆధునిక EV ఛార్జింగ్ వేదికను చేర్చింది, 360kW వరకు పంపిణీ చేసే 28 ఛార్జింగ్ పాయింట్లతో అత్యంత వేగవంతమైన DC ఛార్జర్స్ ను కలిగి ఉంది. ఈ ఫ్లాగ్ షిప్ గమ్యస్థానం ఇంధనం, CNG, EV, రిటైల్, మరియు కేఫ్ అనుభవాలను ఒకే చోటకు తెచ్చింది, కస్టమర్లు మరియు ప్రయాణికులకు ఒకే విధంగా సౌకర్యాన్ని పునర్నిర్వచిస్తోంది.
 
ఈ విడుదల గురించి మాట్లాడుతూ, జియో-బిపి ఛైర్మన్ సార్థక్  బెహూరియా ఇలా అన్నారు, భారతదేశంలో సమీకృత ప్రయాణం యొక్క భవిష్యత్తు కోసం దేవనహళ్లి మొబిలిటి స్టేషన్ మా కలకు ఉదాహరణగా నిలిచింది. ఆధునిక EV ఛార్జింగ్ టెక్నాలజీని మా ఇప్పటికే ఉన్న రిటైల్ వ్యవస్థలోకి తీసుకురావడం ద్వారా, మేము కస్టమర్లకు సౌకర్యం, అందుబాటులో ఉంచడం మెరుగుపరుస్తూనే భారతదేశం తక్కువ కార్బన్ రవాణా పరివర్తనను మద్దతు చేస్తున్నాం. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఉన్న ఈ కేంద్రం, EV యజమానులకు మరియు బెంగళూరులో మరియు చుట్టుప్రక్కల ఉన్న ఫ్లీట్స్ కోసం వేగంగా ఛార్జీ చేసుకోవడానికి, ప్రశాంతత పొందడానికి మరియు ఆత్మవిశ్వాసంతో తమ ప్రయాణాలను కొనసాగించడానికి సదుపాయం కల్పించింది.
 
కెంపెగూడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కీలకంగా ఏర్పాటైన ఈ స్టేషన్ ప్రైవేట్ మరియు వాణిజ్య EV యూజర్లకు సేవలు అందిస్తుంది, వేగవంతమైన మరియు సమర్థవంతమైన ఛార్జింగ్ ను కేటాయిస్తుంది. ఇంధనం భర్తీ చేయడం, షాపింగ్, వైల్డ్ బీన్ కేఫ్ వంటి సదుపాయాలు ద్వారా సౌకర్యం మరియు పరిచయాన్ని నిర్థారిస్తుంది. కస్టమర్లు కాఫీతో ప్రశాంతతను పొందవచ్చు, అవసరమైన వాటిని కొనుగోలు చేయవచ్చు, లేదా తమ వాహనాలను ఛార్జీ చేసుకునే సమయంలో స్వల్ప విరామం తీసుకోవచ్చు- ఇంధనం భర్తీ సమయాన్ని సౌలభ్యం మరియు ఆనందంగా మార్చుకోవచ్చు.
 
భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న మౌళికసదుపాయంతో రూపొందించబడిన ఈ వేదిక విస్తృత శ్రేణి EV మోడల్స్ కు మద్దతునిస్తుంది మరియు భారతదేశంలో వేగంగా పెరుగుతున్న EV వినియోగాన్ని నెరవేరుస్తుంది.
 
కీలకమైన ప్రధానాంశాలు
సమీకృత ఇంధనం, CNG, EV, రిటైల్ మరియు కేఫ్ అనుభవం
మొత్తం 28 ఛార్జ్ పాయింట్లతో 360kWవరకు అత్యంత వేగవంతమైన ఛార్జర్లు పంపిణీ చేస్తాయి
వ్యక్తిగత మరియు ఫ్లీట్ EVలు రెండిటిని మద్దతు చేసే భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే డిజైన్
జియో-బీపీ వ్యవస్థలో  రెడీమ్ చేసుకోదగిన లాయల్టీ రివార్డ్స్ ద్వారా కస్టమర్ కు సంతృప్తి
 
ఈ తొలి కార్యక్రమం సుస్థిరమైన మరియు సమీకృత ప్రయాణంలో జియో-బీపీ యొక్క నాయకత్వాన్ని శక్తివంతం చేస్తోంది. వేగం, నమ్మకం మరియు కస్టమర్ సౌకర్యాన్ని కలపడం ద్వారా, దేవనహళ్లీ కేంద్రం రేంజ్ ఆందోళనను నిర్మూలిస్తోంది మరియు ఎలక్ట్రిక్ మొబిలిటీని ఆత్మవిశ్వాసంతో అనుసరించడానికి కస్టమర్లకు సాధికారత కల్పిస్తోంది. ఆవిష్కరణ, సుస్థిరత మరియు కస్టమర్‌కు ప్రాధాన్యతనిచ్చే డిజైన్ కు జియో-బీపీ యొక్క నిబద్ధతను ఈ సదుపాయం మరింత శక్తివంతం చేసింది, భారతదేశం తమ ప్రయాణాలను తరలించి, శక్తివంతం చేయడానికి కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక