Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిజామాబాద్‌లో కొత్త సర్వీస్ కేంద్రంతో ఇసుజు మోటార్స్ ఇండియా కస్టమర్ సపోర్ట్

Advertiesment
ISUZU

ఐవీఆర్

, గురువారం, 27 నవంబరు 2025 (22:08 IST)
నిజామాబాద్, తెలంగాణాలో తన కొత్త అధీకృత సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించిన ఇసుజు మోటార్స్ ఇండియా తన అమ్మకాల-అనంతర పాదముద్రలను విస్తరించింది. 6S ఆటోమొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చే నిర్వహించబడే ఈ సదుపాయము మాధవ్‎నగర్ లో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయబడింది, తద్వారా వినియోగదారులు ఆ ప్రాంతములో ప్రాప్యత పొందడం సులభం చేసింది. ఈ చేరికతో, తెలంగాణాలో పెరుగుతున్న తన కస్టమర్ బేస్‌కు సౌకర్యవంతమైన, విశ్వసనీయమైన మరియు అధిక-నాణ్యత కలిగిన సర్వీస్ అనుభవాలను అందించాలనే తన నిబద్ధతను ఇసుజు మోటార్స్ ఇండియా పునరుద్ఘాటించింది.
 
కొత్త కేంద్రము ప్రాముఖ్యతను ప్రాధాన్యీకరిస్తూ, ఇసుజు మోటార్స్ ఇండియా నుండి ఉన్నతస్థాయి అధికారులు, 6S ఆటోమొబైల్స్ నుండి ప్రతినిధులు ఈ సదుపాయాన్ని ప్రారంభించారు. అమ్మకాల-అనంతర సేవను వినియోగదారులకు అందుబాటులోకి తేవటానికి ఈ బ్రాండ్ యొక్క నిరంతర ప్రయత్నాలలో మరొక దశను గుర్తించింది.
 
శ్రీ తోరు కిషిమోటో, డెప్యూటి మేనేజింగ్ డైరెక్టర్, ఇసుజు మోటార్స్ ఇండియా, ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణా మాకు అత్యంత ముఖ్యమైన మరియు వేగంగా-అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా నిలిచింది. నిజామాబాద్‌లో కొత్త అధీకృత సర్వీస్ కేంద్రముతో, వినియోగదారులు సరైన సమయానికి, ఆధారపడగలిగేది, నాణ్యమైన సేవలను నిర్ధారించాలనే మా నిబద్ధతకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాము. ఈ ప్రాంతములో అందుబాటును పెంచుటకు, ఇసుజు యజమానులకు మరింత సమర్థవంతంగా సహకారాన్ని అందించుటకు ఈ కొత్త ఏఎస్‎సి వీలుకల్పిస్తుంది అని అన్నారు.
 
శ్రీ శ్రీకర్ కోయల, డీలర్ ప్రిన్సిపల్, 6S ఆటోమొబైల్స్ ఇండియా ప్రై. లి., ఇలా అన్నారు, ఇసుజు మోటార్స్ ఇండియాతో చేతులు కలపడం మరియు ఇసుజు సర్వీస్ నైపుణ్యాన్ని నిజామాబాద్ కు తీసుకొనిరావడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఆధునిక పరికరాలు మరియు సుశిక్షుతులైన వృత్తినిపుణుల సహకారముతో మా సదుపాయము అధిక నాణ్యతా ప్రమాణాలను మరియు వినియోగదారుడి సంతృప్తిని అందించుటకు ఏర్పాటు చేయబడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలోనే తొలిసారిగా లగ్జరీ ఇండెక్స్ సూచికను ప్రారంభించిన కోటక్ ప్రైవేట్