Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వచ్ఛ ఇంధనం వైపు మారుతున్న వేళ పరిశ్రమకు శిలాజ ఇంధనాల మద్దతు అవసరం: ఎస్సార్‌ ఆయిల్‌ ఛైర్మన్‌

Advertiesment
News
, శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (18:50 IST)
భారతదేశపు జీడీపీలో ఉద్గారాల తీవ్రత 45% తగ్గించాలన్న తమ లక్ష్యం చేరుకోవడంలో శిలాజ ఇంధనాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయని పరిశ్రమ నాయకులు విశ్వసిస్తున్నారు. ఇండియా ఎనర్జీ వీక్‌లో భాగంగా నిర్వహించిన ‘అతి తక్కువ కార్బన్‌ ఎనర్జీ మిక్స్‌ దిశగా పరివర్తన: ఇంధన కంపెనీలు ఏవిధంగా స్వీకరిస్తున్నాయి?’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో నిపుణులు స్వచ్ఛ ఇంధన రోడ్‌మ్యాప్‌లో శిలాజ ఇంధనాల ఆవశ్యకతను వెల్లడించారు.
 
స్వచ్ఛ ఇంధన వ్యవస్థలను నిర్మించడానికి అధిక సమయం పడుతుంది. అందువల్ల రెండింటినీ చేయడం స్మార్ట్‌ ఎంపిక. ఇప్పటికే ఉన్న సామర్థ్యాల మార్పు మరియు నూతన శక్తి సామర్థ్యాలను కలిసి సృష్టించాలి అని ప్రశాంత్‌ రుయా, డైరెక్టర్‌, ఎస్సార్‌ క్యాపిటల్‌ అండ్‌ ఛైర్మన్‌ ఆఫ్‌ ద బోర్డ్‌, ఎస్సార్‌ ఆయిల్‌ యుకె అన్నారు.
 
ప్రస్తుత ఇంధనాలను ఒక్కసారిగా మార్చడం సాధ్యం కాదంటూ నూతన, స్వచ్ఛ ఇంధన వ్యవస్థలను నిర్మించడానికి ప్రస్తుత మౌలిక సదుపాయాలను వినియోగించాల్సి ఉందన్నారు. ఈ రంగంలో సాంకేతికత అత్యంత వేగంగా మారుతుందంటూ సాంకేతికతను వేగవంతంగా మెరుగుపరచడం చేయాలన్నారు. హైడ్రోజన్‌ ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గించడం అతి పెద్ద సవాల్‌గా పేర్కొన్న ఆయన రాబోయే రోజుల్లో ఈ రంగంలో అసాధారణ వృద్ధి కనిపించనుందన్నారు.
 
భారతీయ చమురు, సహజవాయు పరిశ్రమ పాత్రను గురించి కేంద్ర పెట్రోలియం, సహజవాయు, గృహ, నగర వ్యవహారాల శాఖామాత్యులు శ్రీ హర్దీప్‌ సింగ్‌ పురి మాట్లాడుతూ, ‘‘ఇటీవలి కాలంలో మన ఆయిల్‌, గ్యాస్‌ పరిశ్రమ గణనీయమైన పురోగతి సాధించింది. క్లిష్ట సమయంలో ఇంధన సరఫరాకు భరోసా కల్పించడం ద్వారా ప్రశంసనీయమైన రీతిలో ఎదిగింది’’ అని అన్నారు.
 
తమ భావి ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు అవసరమైన క్లీన్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ దగ్గరకు వచ్చేసరికి ఇండియా వినూత్నమైన స్థానంలో ఉంది అని హితేష్‌ వైద్‌, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌, కెయిర్న్‌ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ (వేదాంత) అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఏం జరిగిందనేది కాపీ చేయడం కాకుండా మనకంటూ ఓ ప్రణాళిక ఉండాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కౌ హగ్ డే'‌పై వెనక్కి తగ్గిన కేంద్రం.. ఉత్తర్వులు జారీ