Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Book Now, Pay Later: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. 'బుక్ నౌ - పే లేటర్'

Advertiesment
indian railway

ఠాగూర్

, శుక్రవారం, 24 జనవరి 2025 (11:12 IST)
రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ ఒక శుభవార్త చెప్పింది. ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. తమ రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలోనే డబ్బులు చెల్లించకుండా, ఆ తర్వాత చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
బుక్ నౌ.. పే లేటర్ పేరుతో భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌టీసీ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎలాంటి ముందస్తు చెల్లింపు లేకుండానే మీ టిక్కెట్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి అనుమతిస్తుంది. అయితే, మొత్తం బుకింగ్ ప్రక్రియ తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 
 
ఈ సౌకర్యాన్ని పొందాలంటే.. 
1. మీ ఐఆర్‌టీసీ ఖాతాకు లాగిన్ చేయండి.
2. 'బుక్ నౌ' ఎంపికను ఎంచుకోండి.
3. ప్రయాణీకుల వివరాలు, క్యాప్చా కోడ్ కోసం అడుగుతున్న కొత్త పేజీ కనిపిస్తుంది. అవసరమైన సమాచారాన్ని పూరించాలి. ఆ తర్వాత సబ్‌మిట్‌ను క్లిక్ చేయాల్సి వుంటుంది. 
 
 
4. ఆ తర్వాత పేమెంట్ చెల్లించే పేజీని చూపిస్తుంది. 
ఇక్కడ క్రెడిట్/డెబిట్ కార్డ్, భీమ్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించడానికి ఎంచుకోవచ్చు.
 
5. పే లేటర్ ఎంపికను ఉపయోగించడానికి, ముందుగా (www.epaylater.in) సందర్శించడం ద్వారా నమోదు చేసుకోండి.
 
6. రిజిస్ట్రేషన్ తర్వాత, పే లేటర్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండానే టిక్కెట్ బుక్ అవుతుంది. 
 
అయితే, ఇలా బుక్ చేసుకున్న తర్వాత ఆ పేమెంట్‌ను 14 రోజుల లోపు చెల్లించాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో 3.5 శాతం సర్వీస్ చార్జ్‌ను అదనంగా వసూలు చేస్తారు. సకాలంలో చెల్లింపులు జరిగితే మాత్రం ఈ అదనపు రుసుం మాత్రం చెల్లించక్కర్లేదు. 
 
ఈ సమాచారం సాధారణ ప్రయోజనాల కోసం మాత్రమే అని గమనించగలరు. ఏదైనా కొత్త స్కీమ్‌ని ఎంచుకునే ముందు వృత్తిపరమైన సూచనలు సలహాలు పొందింతే మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంతర్జాతీయ విద్యా దినోత్సవం: 2025 ఏడాది థీమ్ ఏంటంటే?