Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉద్యోగులకు షాకిచ్చిన జుకర్‌బర్గ్ - 3600 మందికి ఉద్వాసన!

Advertiesment
MarkZuckerberg

ఠాగూర్

, బుధవారం, 15 జనవరి 2025 (09:25 IST)
మెటా సీఈవో జుకర్‌బర్గ్ తమ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు తేరుకోలేని షాకివ్వనున్నారు. తక్కువ పనితీరును ప్రదర్శిస్తున్న 3600 మందికి ఉద్వాసన పలకనున్నట్టు ప్రకటించారు. పనితీరు ఆధారంగానే ఉద్యోగుల భవిష్యత్ ఉంటుందని గతంలో ఆయన పలుమార్లు హెచ్చరిస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే ఇపుడు తక్కువ పనితీరు చూపిన వారిని గుర్తించి తొలగించనున్నారు. 
 
ఈ క్రమలోనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లకు మాతృసంస్థగా ఉన్న మెటాలో సుమారు 3,600 మంది ఉద్యోగులను తొలగించేందుకు ఆయన సిద్ధమయ్యారు. పనితీరు ఆధారంగా వీరిని గుర్తించారు. వీరి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. అంటే మెటాలోని మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 5 శాతం మందిపై వేటు పడనుంది. 
 
గతేడాది సెప్టెంబర్ నాటికి మెటాలో దాదాపు 72,400 మంది పనిచేస్తున్నారు. తక్కువ సామర్థ్యం కలిగిన వారిని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించుకోబోతున్నట్టు మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా వెల్లడించారు. కంపెనీలో పనితీరు ఆధారిత కోతలు ఉంటాయని స్పష్టం చేశారు. కంపెనీ 'బలమైన ప్రతిభ' కలిగి ఉందని చెప్పడమే దీని ఉద్దేశమని పేర్కొన్నారు. 
 
కొత్త వ్యక్తులను తీసుకొస్తామని చెప్పారు. ప్రదర్శన ఆధారిత కోతలు అమెరికా కంపెనీల్లో సర్వసాధారణమే. మైక్రోసాఫ్ట్ కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. తమ మొత్తం వర్క్ ఫోర్స్‌లలో ఒక శాతం కంటే తక్కువ మందిని తొలగిస్తున్నట్టు గతవారం ప్రకటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణాఫ్రికాలో ఘోరం... బంగారు గనిలో చిక్కున్న కార్మికులు.. 100 మంది మృతి