Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పింక్, తెలుపు రంగు కలయికగా రూ.2 వేల నోట్లు.. ఆన్‌లైన్‌లో హల్‌చల్

భారత రిజర్వు బ్యాంకు త్వరలో రూ.2 వేల విలువ చేసే నోట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. మార్కెట్‌లో అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లకు మంచి డిమాండ్ ఉంది. దీంతో రూ.2 వేల విలువ చేసే

Advertiesment
Images of supposed new Rs 2000 notes
, సోమవారం, 7 నవంబరు 2016 (14:24 IST)
భారత రిజర్వు బ్యాంకు త్వరలో రూ.2 వేల విలువ చేసే నోట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. మార్కెట్‌లో అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లకు మంచి డిమాండ్ ఉంది. దీంతో రూ.2 వేల విలువ చేసే నోట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ కరెన్సీ నోట్ల ముద్రణ మాత్రం మైసూర్‌లోని కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లో జరుగుతోంది. 
 
అయితే ఈ కొత్త నోట్ల విషయమై అటు ప్రభుత్వం గానీ, ఇటు రిజర్వ్ బ్యాంక్ గానీ అధికారికంగా ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇంతకూ ఈ కరెన్సీ నోట్లు ఎలా ఉండబోతున్నాయి? ఈ నోట్లు ఇవేనంటూ తాజాగా ఆన్‌లైన్‌లో పింక్, తెలుపు రంగు కలయికగా రూ.2 వేల నోట్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ లీక్‌డ్ ఫోటోలు అసలైనవా? కావా? అనేది మాత్రం ఇప్పటికైతే ధ్రువీకరణ కాలేదు. కానీ ట్విట్టరాటీలు ఈ ఫోటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో ఒడిస్సా తరహా ఘటన.. తోపుడు బండిలో భార్య మృతదేహం.. 60 కిలోమీటర్లు?