Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అది చేయకపోతే మీ పాన్ కార్డ్ మార్చి 31 తర్వాత ఇన్‌వాలిడ్...

అది చేయకపోతే మీ పాన్ కార్డ్ మార్చి 31 తర్వాత ఇన్‌వాలిడ్...
, సోమవారం, 18 మార్చి 2019 (20:41 IST)
ఆధార్ కార్డ్ - పాన్ కార్డ్ లింక్ చేయకపోతే అంతేసంగతులు అనే ప్రచారం ఊపందుకుంది. మార్చి 31 లోపుగా ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేయనట్లయితే పాన్ కార్డ్ రద్దవుతుందని అంటున్నారు. అందువల్ల పాన్ కార్డ్ - ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని ఇప్పటికే ప్రచార మాధ్యమాల్లో దీని గురించి పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. 
 
కాగా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది దాదాపు 11.44 లక్షల కార్డులను ఇన్‌యాక్టివ్ మోడ్‌లో వుంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31 తర్వాత ఎవరైతే పాన్‌కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేయరో వారి పాన్ కార్డు కూడా ఇలాగే అయిపోవచ్చు. అలా చేస్తే ఇక కార్డు పనిచేయకుండా పోతుంది. ఈ సౌకర్యం ఎందుకంటే... ఆదాయపు పన్ను శాఖ 2019 మార్చి 1 నుంచి ఈ-రిఫండ్స్‌ను నేరుగా వారివారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. అంటే... ట్యాక్స్ రిఫండ్ నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ అవుతుందన్నమాట. పాన్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ అనుసంధానం చేసుకున్న వారికే ఈ సౌలభ్యం ఉంటుంది.
 
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు దీని గురించి చెపుతూ... ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేయాలంటే తప్పనిసరిగా ఆధార్‌, పాన్‌ కార్టులను అనుసంధానం చేయాల్సిందేనంటూ స్పష్టం చేసింది. మార్చి నెల 31 లోపుగా ఈ ప్రక్రియను పన్ను చెల్లింపుదారులు పూర్తి చేసుకోవాలని సూచించింది. కాగా సుప్రీంకోర్టు ఫిబ్రవరి 6న ఇచ్చిన తీర్పులో ఆధార్-పాన్ కార్డ్ అనుసంధానం తప్పనిసరి అని ఇచ్చిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లలు లేరని తిరుమలలో చిన్నారిని కిడ్నాప్... ఆ తరువాత?