Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యుపీఐ ఆటోపే ద్వారా సిప్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశమందిస్తోన్న ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌

cash
, సోమవారం, 4 ఏప్రియల్ 2022 (22:15 IST)
పరిశ్రమలో మొట్టమొదటిసారిగా యుపీఐ ఆటోపే ద్వారా నమోదుచేసుకునే అవకాశాన్ని ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ కల్పించింది. దీనిద్వారా మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్లు తమ ప్రస్తుత యుపీఐ అప్లికేషన్‌లు (గుగూల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం, భిమ్‌, అమెజాన్‌ పే మొదలైనవి) ద్వారా తమ సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్‌(సిప్స్‌) పెట్టుబడులకు ఆటో పే చెల్లింపులు సాధ్యమవుతాయి.

 
ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ పోర్టల్‌ ద్వారా తమ వర్ట్యువల్‌ పేమెంట్‌ అడ్రెస్‌ (వీపీఏ)/యుపీఐ హ్యాండిల్‌‌ను ప్రవేశ పెట్టడంతో పాటుగా తమ యుపీఐ అప్లికేషన్‌లో ఒన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ ధృవీకరణ ద్వారా మదుపరులు సిప్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఈ నమోదు ప్రక్రియ సౌకర్యవంతం. ఎంపిక చేసిన సిప్‌ తేదీన వాయిదా చెల్లింపులు ఆటోమేటిక్‌గా జరుగుతాయి.

 
మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో ఈ ఆటో పే అవకాశాన్ని తీసుకురావడం పట్ల ఐడీఎఫ్‌సీ ఏఎంసీ విశాల్‌ కపూర్‌ మాట్లాడుతూ ‘‘ఈ దశాబ్దం చివరి నాటికి 10 కోట్ల మంది ఇన్వెస్టర్లను చూడాలని మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని సాధించాలంటే మదుపరులకు సౌకర్యవంతమైన సేవలను అందించాల్సి ఉంది. యుపీఐ ఆటోపేను మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో తీసుకురావడం వల్ల సంతోషంగా ఉన్నాం. దీనితో రిజిస్ట్రేషన్‌, సిప్‌ ద్వారా పెట్టుబడులు పెట్టడం నడుమ సమయం గణనీయంగా తగ్గుతుంది. అదనంగా, ఇన్వెస్టర్లు అతి సులభంగా ఈ అప్లికేషన్‌ ద్వారా  మాండెడ్‌ను ఆపడం, సవరించడం లేదా రద్దు చేయడం చేయవచ్చు’’ అని అన్నారు.

 
ఎన్‌పీసీఐ చీఫ్‌ ఆఫ్‌ కార్పోరేట్‌ అండ్‌ ఫిన్‌టెక్‌ రిలేషన్‌షిప్స్‌- కీ ఇనీషియేటివ్స్‌ నళిన్‌ భన్సాల్‌ మాట్లాడుతూ, ‘‘యుపీఐ ఆటోపే ఇంటిగ్రేషన్‌తో ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ మదుపరులు ఇప్పుడు కేవలం సెకన్ల వ్యవధిలో తమ ఈ-మాండెట్‌ను నిర్ధేశించవచ్చు. యుపీఐ ఆటోపేతో ఎన్‌పీసీఐ వద్ద మేము క్రమబద్దీకరించబడిన, సురక్షిత, ఆటోమేటెడ్‌ చెల్లింపు అనుభవాలను వినియోగదారులకు అందించనున్నాం’’ అని అన్నారు.

 
ఐడీఎఫ్‌సీ ఏఎంసీ హెడ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ హేమంత్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ, ‘‘తమ సిప్‌లను నమోదు చేసుకునేందుకు అత్యంత సౌకర్యవంతమైన పద్ధతి యుపీఐ ఆటోపే. సిప్‌ నమోదు మరియు ఇన్‌స్టాల్‌మెంట్‌ ప్రారంభమయ్యే సమయం రెండు వారాల నుంచి ఓ వారానికి తగ్గుతుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండేళ్ల తరువాత పాల ధరలను పెంచిన సిద్స్‌ ఫార్మ్‌