హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమ కాంపాక్ట్ SUV, సరికొత్త హ్యుందాయ్ వెన్యూ బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు నేడు ప్రకటించింది. పట్టణ రవాణా రంగంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పేందుకు సిద్ధమైన సరికొత్త హ్యుందాయ్ వెన్యూ, స్టైల్, ఇన్నోవేషన్, టెక్ అప్ గో బియాండ్ స్ఫూర్తితో రూపొందించబడింది. ఈ కొత్త కాంపాక్ట్ SUV అర్బన్ మొబిలిటీలో ఒక ఉత్తేజకరమైన కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. ఆకట్టుకునే స్టైలింగ్ నుండి టెక్నాలజీతో నిండిన క్యాబిన్ వరకు, సరికొత్త హ్యుందాయ్ వెన్యూ ప్రతి డ్రైవ్‌లోనూ ఎక్కువ ఆశించే కస్టమర్ల కోసం రూపొందించబడింది. ఎక్కువ స్టైల్, ఎక్కువ సౌకర్యం, ఎక్కువ ఆవిష్కరణ.
వినియోగదారులు భారతదేశంలోని ఏ హ్యుందాయ్ డీలర్‌షిప్‌లోనైనా రూ. 25,000 ప్రారంభ బుకింగ్ మొత్తంతో సరికొత్త హ్యుందాయ్ వెన్యూను బుక్ చేసుకోవచ్చు. HMIL నేడు ఒక అద్భుతమైన, ఆకట్టుకునే చిత్రం ద్వారా సరికొత్త హ్యుందాయ్ వెన్యూను ఆవిష్కరించింది. ఈ చిత్రం ఫైటర్ జెట్ యొక్క కచ్చితత్వం, శక్తి, సాంకేతిక నైపుణ్యం నుండి స్ఫూర్తి పొందింది, ఇది సరికొత్త హ్యుందాయ్ వెన్యూ యొక్క అత్యాధునిక సామర్థ్యాలను, ఆత్మవిశ్వాసంతో కూడిన SUV లుక్‌ను ప్రతిబింబిస్తుంది. ఈ చిత్రంలో HMIL బ్రాండ్ అంబాసిడర్, గ్లోబల్ ఐకాన్ దీపికా పదుకొణె ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆమె గంభీరమైన లుక్, ఆధునిక ఆకర్షణ, సరికొత్త హ్యుందాయ్ వెన్యూ యొక్క డైనమిక్ యాటిట్యూడ్, ప్రగతిశీల స్ఫూర్తితో సంపూర్ణంగా సరిపోతాయి. ఆత్మవిశ్వాసం, భవిష్యత్ దృక్పథం కలిగి, బాధ్యతలు స్వీకరించడానికి వెనుకాడని నేటి సాధికార భారతీయ వినియోగదారునికి ఆమె ప్రతీకగా నిలుస్తారు.
సరికొత్త హ్యుందాయ్ వెన్యూను పరిచయం చేస్తూ, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ హోల్-టైమ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, శ్రీ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, హ్యుందాయ్ వెన్యూ భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన SUVలలో ఒకటిగా నిలిచింది. దాని అద్భుతమైన డిజైన్, టెక్నాలజీ, పనితీరుల కారణంగా 7 లక్షల మందికి పైగా కస్టమర్లు దీనిని ఎంచుకున్నారు. సరికొత్త హ్యుందాయ్ వెన్యూతో, మేము ఈ విజయగాథను మరింత ముందుకు తీసుకువెళుతున్నాము. ఆకట్టుకునే డిజైన్, ఆధునిక ప్రీమియం హంగులను పునర్నిర్వచిస్తూ, నేటి తరం కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా అధునాతన టెక్నాలజీని అందిస్తున్నాము. సరికొత్త హ్యుందాయ్ వెన్యూ మా టెక్ అప్ గో బియాండ్ దార్శనికతను నిజంగా ప్రతిబింబిస్తుంది, ఇది మా కస్టమర్ల ఆధునిక జీవనశైలికి సరిగ్గా సరిపోయే, వారితో బలమైన బంధాన్ని ఏర్పరుచుకునే డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది అని అన్నారు.
సరికొత్త హ్యుందాయ్ వెన్యూ తన ఆత్మవిశ్వాసంతో కూడిన లుక్, శక్తివంతమైన డిజైన్ భాషతో రోడ్డుపై ప్రత్యేకంగా నిలుస్తుంది. ట్విన్ హార్న్ LED DRLలు, క్వాడ్ బీమ్ LED హెడ్‌ల్యాంప్స్, దృఢమైన వీల్ ఆర్చ్ డిజైన్, డార్క్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్, R16 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, బ్రిడ్జ్ టైప్ రూఫ్ రైల్స్, ఆకట్టుకునే క్యారెక్టర్ లైన్స్, ఇన్‌గ్లాస్ వెన్యూ ఎంబ్లమ్ వంటి డిజైన్ అంశాలు దాని SUV స్వభావాన్ని, స్ట్రీట్ ప్రెజెన్స్‌ను పెంచేలా రూపొందించబడ్డాయి. SUV యొక్క ఆత్మవిశ్వాసంతో కూడిన లుక్‌ను దాని ఎత్తైన, వెడల్పైన బాడీ డైమెన్షన్స్ మరింత బలపరుస్తాయి.