Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన నూతన మిడ్-లగ్జరీ డిజైన్-ఆధారిత బ్రాండ్

Advertiesment
image
, గురువారం, 17 ఆగస్టు 2023 (23:19 IST)
భారతీయ ఫర్నిచర్ మరియు గృహాలంకరణ రంగంలో సరికొత్త సంస్థ ప్రవేశించింది, ఇది గృహ పరిశ్రమను మార్చడానికి సిద్ధంగా ఉంది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తలు సిద్ధాంత్ & శివాని ఆనంద్‌లు “బే విండో”ను ప్రారంభించారు. ఇది గృహాలంకరణ  విభాగంలోని అంతరాలను తగ్గించే ఉద్దేశ్యంతో మీ ఇంటికి సరైన మిడ్ -లగ్జరీ జీవనశైలిని తీర్చి దిద్దడానికి అంకితం చేయబడింది. పరివర్తనాత్మక గృహాలంకరణ పరిష్కారాలను అందించడానికి అంకితమైన నిపుణుల బృందంతో, బ్రాండ్ వినూత్న&సాంప్రదాయేతర స్థలాలకు ఉత్ప్రేరకంగా మారాలని కోరుకుంటుంది. బే విండో తన మొదటి ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో పాటు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌తో ప్రారంభించనుంది.
 
ఈ రంగంలో అనుభవజ్ఞులైన నిపుణుల కుటుంబం- ఖాజానా గ్రూప్ నుండి వచ్చిన ఈ బ్రాండ్ సౌందర్యానికి మించినది. ఇది నాణ్యతపై రాజీ పడకుండా లేదా ఆర్ధికంగా భారం కాకుండా సౌకర్యం, శైలి మరియు కార్యాచరణ యొక్క సారాంశాన్ని ఒడిసిపడుతుంది. మనస్సాక్షికి సంబంధించిన విధానంతో, బే విండో మీ ప్రత్యేక వ్యక్తిత్వం మరియు జీవనశైలికి నిజమైన ప్రతిబింబంగా ఉండే ప్రాంగణాలును రూపొందించడంలో మీకు సహాయపడుతుంది.
 
బ్రాండ్ డిజైన్ స్ఫూర్తికి హద్దులు లేవు. బ్రాండ్ పరిమిత ఎడిషన్‌లను రూపొందించడానికి ఆండర్స్ ఓస్ట్‌బర్గ్ మరియు లియోన్‌హార్డ్ ఫైఫర్ వంటి గ్లోబల్ డిజైనర్లతో భాగస్వామ్యం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతుల నుండి ప్రేరణ పొందింది. ప్రతిఒక్కరికీ ఏదో ఒక ప్రత్యేకత ఉందని నిర్ధారిస్తూ, వివిధ అభిరుచులు, ప్రాధాన్యతలను అందించే విభిన్న గృహాలంకరణ ఉత్పత్తులను క్యూరేట్ చేయడానికి ఇది బ్రాండ్‌ను అనుమతిస్తుంది.
 
సిద్ధాంత్ ఆనంద్ మాట్లాడుతూ, “రాబోయే 3 సంవత్సరాలలో 10 నగరాల్లో వేగంగా విస్తరించటం ద్వారా, మెరుపు-వేగవంతమైన డెలివరీతో సరసమైన ధరలకు ఆకర్షణీయమైన ఫర్నిచర్ అందించడంతో పాటుగా సాటిలేని ఓమ్నిచానెల్ షాపింగ్ అనుభవాన్ని అందించడం ద్వారా సౌకర్యం  పునర్నిర్వచించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ మా మొదటి ఫ్లాగ్‌షిప్‌  కేంద్రం ఏర్పాటుకు అత్యున్నత అనువైన ప్రదేశంగా నిలుస్తుంది" అని అన్నారు. 
 
తమ ఇంటి ప్రాంగణాలలో సరికొత్త అర్థాన్ని వెదుక్కొనే వారికి, తమతో మెరుగ్గా సంబంధం కలిగి ఉండటంలో సహాయపడుతూ, ప్రతి వస్తువు  వెనుక ఒక  వినూత్న ఆలోచన ఉండాలనుకునే వారికి అనువైనది బే విండో. ఇది బాహ్య & అంతర్గత ప్రపంచాల సమ్మేళనం గా ఉంటూ మిమ్మల్ని ప్రతిబింబించే ప్రాంగణాలతో మీకు సేవ చేస్తుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో తొమ్మిదో తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి