Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

3 నెలల్లో టాటా ఆర్బిట్రేజ్ ఫండ్‌లోకి హైదరాబాద్ పెట్టుబడిదారులు రూ. 310 కోట్లు పెట్టుబడి

Advertiesment
Sailesh Jain

ఐవీఆర్

, మంగళవారం, 22 జులై 2025 (22:05 IST)
హైదరాబాద్: ఈక్విటీ మార్కెట్ అస్థిరతల మధ్య, ముఖ్యంగా తక్కువ రిస్క్ పెట్టుబడి అవకాశాన్ని కోరుకునే వారికి ఆర్బిట్రేజ్ ఫండ్‌లు పెట్టుబడి ఎంపికగా ఆదరణ పొందుతున్నాయి. నగదు, ఫ్యూచర్స్ మార్కెట్ల మధ్య ధర వ్యత్యాసాలకనుగుణంగా పెట్టుబడిగా పెట్టడం ద్వారా, ఈ నిధులు అల్లకల్లోల పరిస్థితుల్లో మెరుగ్గా రాబడులను అందించటానికి ప్రయత్నిస్తాయి, ఫండ్ మేనేజర్‌లకు ఇంట్రా-మంత్ ట్రేడింగ్ అవకాశాలకు ఎక్కువ అవకాశం కల్పిస్తాయి.
 
"ప్రస్తుత వాతావరణంలో, ఆర్బిట్రేజ్ ఫండ్‌లు మార్కెట్ అస్థిరత యొక్క సంభావ్య ప్రయోజనాలను ఒడిసిపట్టటానికి ప్రత్యేకంగా తీర్చిదిద్దబడ్డాయి. ఇవి  పెట్టుబడిదారులను ప్రత్యక్ష ఈక్విటీ రిస్క్‌ల నుండి కాపాడతాయి. ఎలివేటెడ్ రోల్ స్ప్రెడ్‌లు, స్థిరమైన అస్థిరత ఆర్బిట్రేజ్ ఫండ్‌లు సహేతుకమైన రాబడిని అందించడానికి వీలు కల్పిస్తాయి, అయినప్పటికీ సాంప్రదాయ ఆదాయ మార్గాలు తక్కువ ఆకర్షణీయంగా మారాయి. ఈక్విటీ పన్ను రాబడిని కోరుకునే పెట్టుబడిదారులకు, ఆర్బిట్రేజ్ ఫండ్‌లు తగిన ప్రతిపాదనను అందిస్తాయి," అని టాటా అసెట్ మేనేజ్‌మెంట్ ఫండ్ మేనేజర్ శైలేష్ జైన్ అన్నారు.
 
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(AMFI) డేటా ప్రకారం, ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఏప్రిల్, జూన్ 2025 మధ్య రూ.43,077 కోట్లను ఆకర్షించాయి. విస్తృత పరిశ్రమ ధోరణిని ప్రతిబింబిస్తూ, టాటా ఆర్బిట్రేజ్ ఫండ్ కూడా ఏప్రిల్, జూన్ 2025 మధ్య రూ.5,217 కోట్ల నగదు ప్రవాహాలను చూసింది, రూ.310 కోట్లు హైదరాబాద్ నుండి వచ్చాయి. జూన్ 30, 2025 నాటికి ఈ ఫండ్ నిర్వహణలో రూ.14,274 కోట్ల ఆస్తులను కలిగి ఉంది.
 
ఆర్బిట్రేజ్ ఫండ్లు కూడా పన్ను ప్రయోజనాలను అందిస్తాయి, ఎందుకంటే వీటిపై ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల మాదిరిగానే పన్ను విధించబడుతుంది- ముఖ్యంగా పన్ను తర్వాత రాబడిని మెరుగుపర్చుకోవాలని చూస్తున్న అధిక-ఆదాయ పెట్టుబడిదారులకు స్వల్పకాలిక రుణ సాధనాలపై ఇవి ఒక ప్రయోజనాన్ని ఇస్తాయి. సాంప్రదాయ పొదుపు ఎంపికలతో పోలిస్తే సరసమైన రాబడి అవకాశాలతో పాటు, ఈక్విటీ మార్కెట్ ఎక్స్‌పోజర్‌కు వ్యతిరేకంగా తక్కువ-రిస్క్ హెడ్జ్ కోరుకునే వారికి, నేటి అస్థిర వాతావరణంలో ఆర్బిట్రేజ్ ఫండ్లు సంభావ్య పెట్టుబడి అవకాశాన్ని అందిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..