Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కార్పొరేట్ కెఫెటేరియాల సురక్షితమైన కార్యకలాపాల కోసం హంగర్‌బాక్స్ కోవిడ్-19 సేఫ్ పరిష్కారం

కార్పొరేట్ కెఫెటేరియాల సురక్షితమైన కార్యకలాపాల కోసం హంగర్‌బాక్స్ కోవిడ్-19 సేఫ్ పరిష్కారం
, గురువారం, 21 మే 2020 (20:41 IST)
భారతదేశపు అతిపెద్ద వ్యాపార సంస్థలు ఇటీవలి కాలంలో, వారు అనుసరించిన డబ్ల్యుఎఫ్‌హెచ్ (వర్క్ ఫ్రమ్ హోమ్) మోడల్ నుండి క్రమంగా పునఃస్థితికి రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో సిబ్బంది వినియోగించడానికి, కెఫెటేరియాల తిరిగి తెరవడం, సామాజిక దూరం పాటించడం, మెరుగైన తాజా నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉండడం ఎఫ్అండ్‌బి కార్యకలాపాల సంపూర్ణ వేల్యూ చైన్ అంతటా భద్రత, పరిశుభ్రత పాటించడం అనేది ఒక కీలకమైన ప్రాధాన్యతగా మారింది.
 
భారతదేశపు ప్రముఖ సంస్థాగత ఫుడ్-టెక్ సంస్థ అయిన హంగర్‌బాక్స్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ (ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ఆధారంగా ఒక శక్తివంతమైన పరిష్కారాన్ని ఆవిష్కరించింది. కెఫెటేరియాల కార్యకలాపాలను ‘కోవిడ్-19 సురక్షితంగా’ చేయడానికి భారత ప్రభుత్వం వారి ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగిస్తుంది.
 
హంగర్‌బాక్స్ సిఇఓ మరియు సహ వ్యవస్థాపకుడు, సందీపన్ మిత్రా మాట్లాడుతూ, “హంగర్‌బాక్స్ 'కోవిడ్-19 సేఫ్' అనే పరిష్కారం సాంకేతిక పరిజ్ఞానం, వినియోగదారు అనుసంధానితం మరియు కమ్యూనికేషన్, ఐదంచల అంశాల విధానాన్ని పాటిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పర్యవేక్షణా శిక్షణ మరియు వంటగది కొరకు మెరుగైన నియమాల వంటివి ఇందులో, నిర్వహణా సిబ్బందిపై నిశితమైన తనిఖీలు, కెఫెటేరియాల కార్యకలాపాల యొక్క 360 డిగ్రీల వీక్షణను కలిగి ఉన్న టెక్-నేతృత్వంలోని పర్యవేక్షణ వ్యవస్థతో సహా కెఫెటేరియాల కార్యకలాపాలు ఉంటాయి.” అని అన్నారు
 
"కెఫెలు రోజంతా వినియోగదారుల స్థిరమైన ప్రవాహాన్ని స్వీకరిస్తుండగా, సంస్థాగత నేపధ్యంలో కెఫెటేరియాలలు మధ్యాహ్నం 1:17 గంటలకు గరిష్ట రద్దీని కలిగి ఉంటాయని డేటా చూపిస్తోంది. రద్దీతో పాటు, నగదు లావాదేవీల వలన కూడా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. కెఫెలలో రద్దీని తగ్గించడాని ఈ పరిష్కారాన్ని సైతం ఏర్పాటు చేయడానికి, నష్టాలను తగ్గించడానికి, ఆహార కాలుష్యం, కోవిడ్-19 సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ వారి తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా మెరుగైన భద్రతా చర్యలు, కార్యాచరణ విధానాలను అమలు చేయడానికి మేము మా ఖాతాదారులతో కలిసి పనిచేశాము, ”అని మిత్రా చెప్పారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి, తిరుమలకు మాత్రం?