చైనాలో కరోనా డిసెంబరులో కాదు.. అక్టోబర్‌లోనే పుట్టిందట..

బుధవారం, 20 మే 2020 (11:53 IST)
కరోనా వైరస్‌కు చైనాలోని వూహాన్ నగరం పుట్టినిల్లు. హుబేయి ప్రావిన్స్ రాజధాని వుహాన్‌లో డిసెంబర్‌లో వైరస్ వ్యాప్తి మొదలైందని చైనా ప్రభుత్వం వాదిస్తోంది. అయితే చైనాలో అక్టోబర్‌లోనే కరోనా వైరస్ వ్యాప్తి మొదలైందని కొంతమంది వాదిస్తున్నారు. కరోనా వైరస్‌కు కేంద్ర బిందువైన వుహాన్‌లో గత ఏడాది అక్టోబర్‌లో వరల్డ్ మిలిటరీ స్పోర్ట్స్ జరిగాయి. ఈ క్రీడల్లో పాల్గొన్న పలువురు ఆటగాళ్లు తాము కరోనా లక్షణాలను ఎదుర్కొన్నామని చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. 
 
వుహాన్‌లో అక్టోబర్‌లో జరిగిన సైనిక క్రీడల్లో వంద దేశాల నుంచి దాదాపు 10 వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో చాలా మంది ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారని, కొందరిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయని వెలుగులోకి వచ్చింది. కొంత మంది పరీక్షలు నిర్వహించుకుంటే కరోనా పాజిటివ్‌‌గా రావడం షాక్‌కు గురిచేస్తోంది.
 
వుహాన్‌లో తొలి కేసు డిసెంబర్లో నమోదైందని చైనా చెబుతోందనీ.. కానీ అక్టోబర్‌లోనే ఆ నగర వీధులన్నీ నిర్జనంగా కనిపించాయని లక్సెంబర్గ్ ట్రయాథ్లెట్ ఒలీవర్ జార్జెస్ తెలిపారు. సైనిక క్రీడల్లో పాల్గొన్న కొద్ది రోజుల తర్వాత తనలో జ్వరం, దగ్గు లక్షణాలు కనిపించాయని.. అది కరోనా వైరసో, కాదో తెలుసుకునేందుకు యాంటీబాడీ పరీక్షలు చేయించుకోబోతున్నానని చెప్పారు. జనవరిలో కొవిడ్-19 తీవ్రత ఎక్కువగా ఉందని చైనా చెబుతున్నప్పటికీ అక్టోబర్‌లోనే వీధులన్నింటినీ రసాయనాలతో స్ప్రే చేయడం చూశామని తమ అథ్లెట్లు చెప్పారని జార్జెస్ తెలిపారు.  

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కరోనా వైరస్ విజృంభణ.. తమిళనాడులో ఒక్కరోజేలోనే 552 కేసులు