Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్యాంకు సేవింగ్స్ ఖాతాను జన్‌ధన్ అకౌంట్‌గా మార్చుకునేదెలా?

Advertiesment
బ్యాంకు సేవింగ్స్ ఖాతాను జన్‌ధన్ అకౌంట్‌గా మార్చుకునేదెలా?
, సోమవారం, 12 ఏప్రియల్ 2021 (15:16 IST)
ఇపుడు బ్యాంకు ఖాతాలేనివారు ఉండకపోవచ్చని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండాలన్న ఉద్దేశ్యంతో జీరో బ్యాలెన్స్‌డ్ జన్‌ధన్ ఖాతాను ప్రారంభించింది. జన్‌ధన్ పేరిట దేశ ప్రజలందరి చేత బ్యాంకు ఖాతాలను తెరిపించింది. 
 
జన్‌ధన్ బ్యాంకు ఖాతా కలిగిన వారికి బీమా కల్పించడంతో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులను కూడా ఆ ఖాతాల్లోనే వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు.. ఈ ఖాతాను ఉచితంగానే తెరవడం జరుగుతుందని స్పష్టం చేశారు. దాంతో దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రజలు జన్‌ధన్ ఖాతాలను తెరిచారు. 
 
అయితే, ఇప్పటికీ కొంతమంది ప్రజలకు జన్‌ధన్ ఖాతా లేదు. దాంతో వారు ప్రభుత్వ ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. అలాంటి వారికోసమే.. సరికొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. ఇతర బ్యాంకు ఖాతా కలిగి ఉన్నా.. దానిని జన్‌ధన్ అకౌంట్‌ కిందకు మార్చుకునే వెసులుబాటు కల్పించారు. 
 
ఈ అవకాశంతో ప్రజలు తమ సాధారణ బ్యాంకు ఖాతాలను జన్‌ధన్ అకౌంట్లుగా మార్చుకునేందుకు వీలు ఉంటుంది. మరి సాధారణ బ్యాంకు ఖాతాలను జన్‌ధన్ అకౌంట్లుగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
సాధారణ బ్యాంక్ అకౌంట్‌ను జన్‌ధన్ అకౌంట్‌గా మార్చుకోవాలంటే సదరు వ్యక్తులు బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. బ్యాంక్‌ అధికారులు తమ ప్రతిపాదనను చెబితే.. వారు ఒక రిక్వెస్ట్ ఫారం ఇస్తారు. ఆ ఫారంలో అవసరమైన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. తమ అకౌంట్‌ను జన్‌ధన్ అకౌంట్‌గా మార్చుకోవాలనుకుంటున్నట్లు అందులో పేర్కొనాలి. 
 
అలా చేసిన తరువాత ఆ ఫారానికి ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్(ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్) వంటివి జత చేయాలి. వాటిని బ్యాంకులో సబ్మిట్ చేసిన తరువాత.. అధికారులు పరిశీలిస్తారు. ఆ తరువాత మీ ఖాతాను జన్‌ధన్ అకౌంట్‌గా మార్చేస్తారు. ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే.. ఇతర బ్యాంకుల్లో మీకు జన్‌ధన్ అకౌంట్ ఉన్నట్లయితే మీ అభ్యర్థన తిరస్కరించబడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కలకలం.. ఆ రాష్ట్రంలో 18 జిల్లాల్లో లాక్ డౌన్.. మహారాష్ట్రలోనూ..?