Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్కెట్లోకి 2 డబ్ల్యు కెపాసిటీ కలిగిన 18,000 ఈవీలు: సీజర్ టెక్నాలజీస్‌తో హలా మొబిలిటి భాగస్వామ్యం

Advertiesment
Hala Mobility

ఐవీఆర్

, మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (23:10 IST)
ఈ-మాస్ EV Fleet ప్లాట్ ఫారమ్‌లో అప్రతిహతంగా దూసుకుపోతున్న హలా మొబిలిటీ... ప్రముఖ లిథియం-అయాన్ బ్యాటరీల తయారీ సంస్థ Sieger Technologiesతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా 2026 నాటికి హైదరాబాద్‌లో 18,000 టు EV 2 వీలర్స్‌ను మార్కెట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిద్వారా మొదటి విడతగా హలా మొబిలిటీ 2000 E2Wలను అందించేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో అంటే 2026 నాటికి 18,000 E2Ws అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాతి రోజుల్లో చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, ముంబై మరియు పూణే లాంచి వంటి ఇతర ప్రధాన భారతీయ నగరాలకు విస్తరించబోతున్నారు.
 
ఈ భాగస్వామ్యం... ఈవీ ఛార్జింగ్ కు సంపూర్ణ పరిష్కార మార్గాలను సూచిస్తుంది. దీంతోపాటు Sieger యొక్క అధునాతన బ్యాటరీ సాంకేతికత ద్వారా, హలా మొబిలిటీ బ్యాటరీ స్వాప్ సామర్థ్యాలు, వేగవంతమైన ఛార్జ్/డిశ్చార్జి మరియు పొడిగించిన లైఫ్ సైకిల్ నుండి దాని ఫ్లీట్ విస్తరణల అత్యుత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. యాప్-ఆధారిత సేవల ప్లాట్‌ఫారమ్‌తో పాటు, పలురకాల విభిన్నమైన ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తుంది హలా మొబిలిటీ. తద్వారా వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడే అనేక రకాల ఎలక్ట్రిక్ ట్రాన్స్‌ పోర్టేషన్‌లను సజావుగా ఎంచుకోవడానికి ఇది అవకాశాన్ని కల్పిస్తుంది.
 
ఈ సందర్భంగా హలా మొబిలిటీ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ శ్రీ  శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. "Halaలో మేము ఎలక్ట్రిక్ వెహికల్ (EV) సేవలను మరింత మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. మా వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించేందుకు సౌలభ్యం, సౌకర్యం మరియు ప్రాధాన్యతనిచ్చే సాంకేతికతతో కూడిన అత్యాధునిక పరిష్కారాల కోసం ప్రతీక్షణం అన్వేషిస్తూనే ఉంటాం.
 
“కేవలం 40 నిమిషాల్లో తమ ఈవీలను 80% వరకు ఛార్జ్ చేసే టెక్నాలజీ ఇప్పుడు రైడర్ లకు మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది. తద్వారా ఎలాంటి టెన్షన్ లేకుండా వినియోగదారులు తమ వాహనాలను రైడ్ చేసుకోవచ్చు మరియు మెరుగైన మైలేజ్ ద్వారా ఆర్థికంగా ఉపయోగంగా ఉంటుంది. అంతేకాకుండా పొడిగించిన బ్యాటరీ లైఫ్‌తో సమర్థవంతమైన 2W పరిష్కారం కూడా లభిస్తుంది. ఈ సహకారాలు మా ప్లాట్‌ఫారమ్ యొక్క యాక్సెసిబిలిటీ మరియు రీచ్‌ను పెంచడమే కాకుండా వినియోగదారులకు స్థిరమైన మొబిలిటీ ఎంపికలను మరింత ఆకర్షణీయంగా మరియు ఆచరణాత్మకంగా చేయడానికి కూడా దోహదం చేస్తాయి.” అని శ్రీకాంత్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తు.. 360 స్థానాలు వస్తాయ్.. పురంధేశ్వరి