Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రహ్మానందం పిసినారేకాదు గొప్ప వేదాంతి, యూత్ కు స్పూర్తి అని చెప్పే `నేను`

Bramhi- chiru- nenu book

డీవీ

, గురువారం, 1 ఫిబ్రవరి 2024 (16:22 IST)
Bramhi- chiru- nenu book
సార్ధక నామధేయులు మాత్రం కొందరే. అందులో ముఖ్యంగా మరీ ముఖ్యంగా చాలా ముఖ్యంగా తన పేరును చిరస్థాయిగా నిలుపుకున్న వ్యక్తి, శక్తి  డాక్టర్‌ పద్మశ్రీ బ్రహ్మానందంగారు. నేడు ఆయన పుట్టినరోజు.  ఆయన జీవితం.. జీవితంలోని కొన్ని అద్భుతమైన సంఘటనలు, టర్న్‌లు, ట్విస్టులు వీటన్నింటి సమాహారమే ‘నేను’ అనే పుస్తకం.. ప్రతేడాది పుట్టినరోజు అనగానే. తెలియకుండానే ఈ ఏడాది ఏమి సాధించాం? అనుకుంటాం. ఈ ఫిబ్రవరి ఒకటో తేది స్పెషల్‌ ఏంటంటే.. బ్రహ్మి ఇప్పటివరకు సాధించిన పుట్టినరోజలన్ని కట్టకట్టి లెక్క పెట్టి ఇది ‘‘నేను’’ నేనుగా సంధించి సాధించుకున్నాను..  అని 321 పేజిల్లో తన జీవితాన్ని మడతపెట్టి ఏడవండి? నవ్వండి? ఏమైనా అనుకోండి? ఇదే సత్యం అని జీవితం  మొత్తాన్ని చెప్పి తన బర్త్‌డేకి ఈ ఏడాది ఎంతో స్పెషల్‌ అంటూ తన ఫ్యాన్స్‌కి తనను చూసి నవ్వే ప్రతివారికి గిఫ్ట్‌ ఇచ్చారు...
 .
నేను అంటే స్వార్థం. నీలో నేను ను తీసేయ్. అందరూ కలిసి వుండడమే జీవితంలోని గొప్పతనం.. ఇవన్నీ చాలామంది చెప్పారు. అహం పోతే నీలోనువ్వు తెలుసుకుంటావ్.. చాంతాడంత జీవితాన్ని బ్రహ్మానందం నేను అనే పుస్తకంలో ఆవిష్కరించారు.
 
చదివితే అన్నీ తెలిసినవే అన్నట్లు అనిపించినా బ్రహ్మానందం చెప్పింది వేరు. నేను.. అనే పుస్తకాన్ని కన్నెగంటి బ్రహ్మానందం చరిత్ర.  గొప్ప నటన, హోదా, ఐశ్వర్యం, కీర్తి వుండవచ్చు అవన్నీ వున్నా ఏదో వెలితి వుందనిపించేదట. అందుకే అందరికీ ప్రతి  మనిషి అంతర్ మూలాల్లోకి వెళ్ళాలి అనేది బ్రహ్మి చెప్పిన సిద్దాంతం.
 
ఇదంతా చదివితే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు గుర్తుకువస్తాయి. పెద్దతనాన్ని చెప్పలేనంత మంది ఈ భూమిలో వుండవచ్చు. భూమ్మిక ఏదో చేయడానికి పుడతారు. గురువు, పేదరికం ఎందుకు పుడతాం. అలా పుట్టడమే ఒక ఐశ్వర్యంగా ఆయన చెబుతాడు. చాలా మటుకు ఆయనకున్న జ్నానపశక్తికి క్రీడీకరించారు. ఒక్కోసారి ఆత్మ విశ్వాసం పుణికి పుచ్చుకున్నట్లుంటుంది. డబ్బు అవసరమైతే రాదు. సంపాదించడం సాధ్యం చేస్తేనే డబ్బు వస్తుంది. గిన్నిస్ బుక్ లో వుండవచ్చు. పద్మ అవార్డు రావచ్చు. ఆయన్ను చూసినట్లుండేలా నేను పుస్తకం వుంది. కొన్ని సార్లు ఆయన చేసిందీ తప్పే అయినా సన్నివేశపరంగా కరెక్టే అనిపిస్తుంది. అదే నేను.. 350 రూాపాయలు ఖరీదు చేసే ఈ పుస్తకం యూత్ కు స్పూర్తిగా వుంటుందనిపిస్తుంది. ఒక్కోసారి మనల్ని మనం తరచి చూసుకున్నట్లుంది.
బ్రహ్మానందం పిసినారి అనే నానుడి. దాని వెనుక కారణాన్ని నేను లో తరచి చూపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందమైన ప్రేమ కథా చిత్రంగా రాధా మాధవం ట్రైలర్ : హీరో శ్రీకాంత్