పోటీ పరీక్షలకు శిక్షణ కూడా వాణిజ్యమే.. జీఎస్టీ చెల్లించాల్సిందే...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు 'ఒకే దేశం.. ఒకే పన్ను' పేరుతో తీసుకొచ్చిన జీఎస్టీ చట్టంతో పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోంది. కేవలం ఆహార పదార్థాలేకాకుండా, ప్రతి నిత్యావసర వస్తు సరకులు, హోటల్, తి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు 'ఒకే దేశం.. ఒకే పన్ను' పేరుతో తీసుకొచ్చిన జీఎస్టీ చట్టంతో పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోంది. కేవలం ఆహార పదార్థాలేకాకుండా, ప్రతి నిత్యావసర వస్తు సరకులు, హోటల్, తినుబండరాలు, వస్త్రాలు ఇలా ప్రతి ఒక్కదానిపై జీఎస్టీ పన్నును వసూలు చేస్తున్నారు.
అయితే, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించే పోటీ పరీక్షలకు తమ పిల్లలను సమాయత్తం చేసే నిర్వహించే ఇప్పించే శిక్షణ కూడా వాణిజ్యపరమైన అంశంగా కేంద్ర భావించి, జీఎస్టీని విధించింది. ఇది పేద, మధ్యతరగతి ప్రజలపై పెను ఆర్థిక భారాన్ని మోపుతోంది. తాజాగా ట్యూషన్ చెల్లించే ఫీజుపై కూడా ఓ విద్యా సంస్థ జీఎస్టీని వసూలు చేసింది. ఈ సంఘటన చెన్నైలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
చెన్నైలోని ఓ పాఠశాలలో చదువుకునే ఓ విద్యార్థి రూ.10 వేలు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉండగా, జీఎస్టీ పన్ను రూపేణా రూ.1,800 చెల్లించాలని పాఠశాల యాజమాన్యం పేర్కొనడంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఉద్యోగ అవకాశం కోసం పోటీ పరీక్ష అయినప్పటికీ నీట్ వంటి ఉన్నత విద్యకుగాను నిర్వహించే పోటీ పరీక్ష అయినప్పటికీ శిక్షణ కేంద్రాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ శిక్షణ కేంద్రాలకు జీఎస్టీకి మినహాయింపు ఇవ్వాలని ట్యూషన్ సెంటర్ల నిర్వాహకులు కోరుతున్నారు.