Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రామ పెద్ద బర్త్‌డే.. డాన్స్ బార్‌గా మారిన పాఠశాల.. అమ్మాయిలతో అర్థనగ్న నృత్యాలు

ఆ ఊరిలో గ్రామ పెద్ద పుట్టినరోజు వేడుకలను ఒక వైభంగా జరుపుకున్నారు. ఏకంగా ప్రభుత్వ పాఠశాలకు సెలవు ప్రకటించి.. పాఠశాల తరగతి గదులను డ్యాన్స్‌ బార్‌గా మార్చి అమ్మాయిలతో అర్థనగ్న డ్యాన్సులు వేయించారు. ఇది బ

Advertiesment
గ్రామ పెద్ద బర్త్‌డే.. డాన్స్ బార్‌గా మారిన పాఠశాల.. అమ్మాయిలతో అర్థనగ్న నృత్యాలు
, గురువారం, 10 ఆగస్టు 2017 (10:32 IST)
ఆ ఊరిలో గ్రామ పెద్ద పుట్టినరోజు వేడుకలను ఒక వైభంగా జరుపుకున్నారు. ఏకంగా ప్రభుత్వ పాఠశాలకు సెలవు ప్రకటించి.. పాఠశాల తరగతి గదులను డ్యాన్స్‌ బార్‌గా మార్చి అమ్మాయిలతో అర్థనగ్న డ్యాన్సులు వేయించారు. ఇది బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మీర్జాపూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. అదే రోజు ఆ గ్రామ పెద్ద రాంకేష్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు కూడా. ఈ బర్త్‌డేను పురస్కరించుకుని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఆ తర్వాత అమ్మాయిలను రప్పించి వారితో అర్థనగ్నంగా నృత్యం చేయించారు. 
 
కొందరు పాఠశాలలోనే మద్యం తాగి అమ్మాయిల రికార్డింగు డ్యాన్సుతో మజా చేశారు. పాఠశాలను డ్యాన్స్ బార్‌గా మార్చిన ఘటనపై అసిస్టెంట్ ఉపాధ్యాయుడు అశోక్ కుమార్ శిక్షా అధికారి ప్రవీణ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ప్రవీణ్ కుమార్ ప్రభుత్వ పాఠశాలను డ్యాన్స్ బార్‌గా మార్చారని మండల విద్యాశాఖ అధికారి తివారీకి నివేదిక సమర్పించారు. 
 
పాఠశాలలో మద్యం తాగి డ్యాన్సులు చేయడం అభ్యంతరకరమని దీనిపై గ్రామ పెద్ద రాంకేష్ యాదవ్‌పై కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా మెజిస్ట్రేట్‌కు నివేదించారు. దీనిపై వివాదం జరిగిన తర్వాతగానీ గ్రామపెద్దకు తాను చేసిన తప్పేంటో అర్థంకాలేదు. స్కూల్‌లో డ్యాన్స్ కార్యక్రమం జరిగినపుడు తాను లేనని, తన బంధువుల ఇంట్లో ఉన్నానని తప్పించుకోవడం కొసమెరుపు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైనర్ భార్యతో బలవంతపు శృంగారం(రేప్)లో పాల్గొన్నా తప్పులేదు