Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో అక్రమ లోన్‌ యాప్స్‌కు చెక్.. రంగంలోకి దిగిన గూగుల్

loan
, మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (15:28 IST)
భారత్‌లో అక్రమ లోన్‌ యాప్స్‌ను కట్టడి చేసేందుకు తమకు సాయపడాలని టెక్‌ దిగ్గజం గూగూల్‌ను కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కోరాయి. లోన్స్ యాప్స్ భరతం పట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ నడుం బిగించింది. దీనికి తోడు టెక్ దిగ్గజం గూగుల్ కూడా రంగంలోకి దిగింది. భారత్‌లో అక్రమ లోన్‌ యాప్స్‌ను కట్టడి చేసేందుకు తమకు సాయపడాలని గూగుల్ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్బీఐని కోరింది. 
 
అక్రమ లోన్‌ యాప్స్‌ విషయంలో మరింత కఠినమైన నిబంధనలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశాయి. ప్లేస్టోర్స్‌లోనే కాదు వెబ్‌సైట్స్‌, ఇతర మార్గాల ద్వారా కూడా ఇలాంటి అక్రమ యాప్స్‌ పెచ్చరిల్లకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. 
 
కానీ వాస్తవానికి ఆర్బీఐ పరిధిలోకి గూగుల్ రానప్పటికీ ఆర్బీఐ అధికారులు గడిచిన కొన్ని నెలలుగా అనేకసార్లు గూగుల్‌ ప్రతినిధులను పిలిచి అక్రమ లోన్‌ యాప్స్‌ విషయమై చర్చించారు. మరోవైపు ఆర్థిక సేవల యాప్స్‌కు సంబంధించి తాము గతేడాది సెప్టెంబర్‌ నుంచి ప్రోగ్రామ్‌ పాలసీని మార్చినట్టు గూగుల్‌ ప్రకటించింది.
 
భారత్‌లో పర్సనల్‌ లోన్‌ యాప్స్‌కు ఇది వర్తిస్తుందని తెలిపింది. భారత్‌ను టార్గెట్‌ను ప్లేస్టోర్‌లో 2000 పర్సనల్‌ లోన్‌ యాప్స్‌ ఉన్నట్టు, అవన్నీ విధాన నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించామని గూగుల్‌ వెల్లడించింది. అందుకే ఇలాంటి లోన్ యాప్‌లపై కొరడా ఝుళిపించేందుకు కేంద్రంతో పాటు ఆర్బీఐ సహకారం కావాలని గూగుల్ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కబడ్డీ ఆటగాళ్ళకు అవమానం.. బాత్రూమ్‌లో ఆహారం