Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నూతన హైదరాబాద్ కార్యాలయాన్ని ప్రారంభించిన గోల్డ్‌మన్ సాచ్స్

Advertiesment
image
, గురువారం, 5 అక్టోబరు 2023 (16:36 IST)
గోల్డ్‌మన్ సాచ్స్, భారతదేశంలో దాని నిరంతర వృద్ధిలో కీలక మైలురాయిని ప్రకటిస్తూ, హైదరాబాద్‌లో నూతన అత్యాధునిక కార్యాలయం, ఒపెల్‌‌ను ప్రారంభించినట్లు ఈ రోజు వెల్లడించింది. ఈ సంస్థ యొక్క క్లయింట్ ఆన్‌బోర్డింగ్ ప్రయత్నాలకు ఈ కార్యాలయం అత్యుత్తమ కేంద్రంగా ఉంటుంది. ప్లాట్‌ఫారమ్ ఇంజనీరింగ్ మరియు గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్ పార్టనర్‌షిప్‌లకు నిలయంగా నిలుస్తుంది.
 
గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్- పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, శ్రీ కె.టి.రామారావు ఈ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ: “2021లో హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను తొలుత ప్రారంభించిన తరువాత గోల్డ్‌మన్ సాచ్స్ నూతన దీర్ఘకాలిక కార్యాలయాన్ని ప్రారంభిస్తుండటం పట్ల నేను సంతోషంగా వున్నాను. ఇది హైదరాబాద్‌లో బహుళజాతి సంస్థలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేయటానికి అవసరమైన మద్దతు అందించటంతో పాటుగా వారిని ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించేలా, కృషి చేస్తున్న తెలంగాణ యొక్క సమగ్ర కార్యక్రమాలను ప్రతిబింబిస్తుంది. ఇది మన ప్రస్తుత గ్లోబల్ కంపెనీలు, స్టార్టప్‌ల యొక్క శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థకు దోహదం చేస్తుంది. స్థానిక ప్రతిభకు ప్రపంచ అవకాశాలను సృష్టిస్తుంది. డిజిటల్ అక్షరాస్యత, మహిళా వ్యవస్థాపకత, స్థానిక వెండార్ ఎంగేజ్‌మెంట్‌లతో కూడిన కార్యక్రమాల ద్వారా స్థానిక సమాజాన్ని ఉద్ధరించడానికి చూపుతున్న గోల్డ్‌మన్ సాచ్స్ నిబద్ధతను నేను అభినందిస్తున్నాను" అని అన్నారు.
 
గోల్డ్‌మన్ సాచ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిచర్డ్ గ్నోడ్ ఈ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, “భారతదేశంలో మా వృద్ధి కథ దేశం లోని అసాధారణ ప్రతిభతో శక్తివంతంగా ముందుకు సాగుతుంది. గత రెండు దశాబ్దాలుగా, సంస్థ యొక్క ప్రపంచ స్థాయి కార్యకలాపాలలో బెంగళూరు, హైదరాబాద్ అంతర్భాగంగా వున్నాయి. మా నూతన హైదరాబాద్ కార్యాలయం ప్రపంచ స్థాయి భారతీయ ప్రతిభ పట్ల సంస్థ యొక్క నిరంతర నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది" అని అన్నారు. 
 
గోల్డ్‌మన్ సాచ్స్ సర్వీసెస్ ఇండియా కంట్రీ హెడ్- గోల్డ్‌మన్ సాచ్స్‌లో ఇంజినీరింగ్ విభాగానికి గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గుంజన్ సమతాని మాట్లాడుతూ: “ఈ నూతన హైదరాబాద్ కార్యాలయం సహకారం, ఆవిష్కరణ, స్థిరత్వం మరియు అత్యాధునిక సాంకేతికత, మా ఉద్యోగులను స్థానికంగా నియమించటం, ప్రపంచవ్యాప్తంగా సహకరించడానికి తోడ్పడటంలో మా నిబద్ధత కు సంబంధించి మా ప్రాధాన్యతలను ఉదాహరిస్తుంది. కేవలం రెండేళ్ళలో, హైదరాబాద్‌లోని మా బృందాలు మా ఇంజనీరింగ్ ప్లాట్‌ఫారమ్‌లను పునఃరూపకల్పన చేయడం, టాలెంట్ ఎంగేజ్మెంట్ ప్రక్రియల ద్వారా సంస్థ కోసం మెరుగైన క్లయింట్ అనుభవాన్ని, ఆదాయ మార్గాలను అందించటానికి లోతైన సామర్థ్యాలను ఏర్పరచుకున్నాయి..." అని అన్నారు. 
 
నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, గోల్డ్‌మన్ సాచ్స్  ఆసియా పసిఫిక్(జపాన్ మినహా ) ప్రెసిడెంట్ కెవిన్ స్నీడర్, ఇండియాలోని గోల్డ్‌మన్ సాచ్స్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోంజోయ్ ఛటర్జీ, గోల్డ్‌మన్ సాచ్స్ సర్వీసెస్ ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రవి కృష్ణన్, స్థానిక పరిశ్రమ ప్రతినిధులు మరియు సంస్థ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉపాధ్యాయురాలిపై అత్యాచారం.. గ్రేటర్ నోయిడాలో ఘోరం..