Publish Date: Mon, 08 Jun 2026 (13:27 IST)
Updated Date: Mon, 08 Jun 2026 (13:29 IST)
బంగారం వెండి ధరలు పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 4,300 డాలర్ల కనిష్టానికి పడిపోవడం మదుపర్లలో ఆందోళన కలిగిస్తోంది. ముడి చమురు ధరలు 4 శాతం వరకు పెరగడం కూడా మార్కెట్ ఒడిదుడుకులకు ప్రధాన కారణంగా మారుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న ప్రతికూల సంకేతాల కారణంగా బంగారం పది గ్రాములకు రూ.2వేల మేర తగ్గి, రూ.1.54 లక్షల దిగువకు చేరుకుంది. వెండి ధర కూడా ఇదే బాటలో పయనిస్తూ కిలోకు రూ. 6,500 కంటే ఎక్కువగా క్షీణించి రూ. 2.43 లక్షల లోపు ట్రేడ్ అవుతోంది.
అమెరికా వడ్డీ రేట్లు దీర్ఘకాలం అధికంగా ఉంటాయన్న సంకేతాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదని స్పష్టమవుతోంది.