Publish Date: Fri, 03 Apr 2026 (14:37 IST)
Updated Date: Fri, 03 Apr 2026 (14:38 IST)
బంగారం ధరలు మళ్లీ పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ మార్కెట్‌లో పెరిగిన డిమాండ్ నేపథ్యంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా ఎగబడ్డాయి.
తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం గురువారంతో పోలిస్తే ఏకంగా రూ.1,960కి పెరిగింది. దీంతో ప్రస్తుతం ధర రూ.1,50,930 వద్ద కొనసాగుతోంది. ఇక ఆభరణాల బంగారం తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,800 పెరిగింది.
ప్రస్తుత మార్కెట్‌లో ఇది రూ.1,38,350 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. కిలో వెండి ధర నిన్నటి స్థాయిలోనే రూ.2,55,00 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటం బంగారం మదుపుదారుల వైపు మొగ్గుచూపుతుండటంతో ధరల్లో ఈ పెరుగుదల కనిపిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు.