Publish Date: Sat, 04 Apr 2026 (11:24 IST)
Updated Date: Sat, 04 Apr 2026 (11:26 IST)
భారత్‌లో పసిడి ధర తన రికార్డు గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 17 శాతం కిందకు దిగివచ్చింది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్నప్పటికీ.. బంగారం ధరలు పడిపోతున్నాయి.
ప్రస్తుతం ఎంసీఎక్స్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,650 వద్ద ముగిసింది. ఇది ఆల్-టైమ్ హై అయిన రూ.1,80,779తో పోలిస్తే సుమారు రూ.31,000 తక్కువగా వుండటం గమనార్హం.
యుద్ధ వాతావరణంతో ముడిచమురు ధరలు పెరగడం అమెరికా డాలర్‌ను బలపరిచింది. సాధారణంగా డాలర్ బలపడితే ఇతర కరెన్సీలు ఉన్నవారికి బంగారం కొనుగోలు ఖరీదుగా మారుతుంది. ఇది పసిడి పెరుగుదలకు అడ్డుకట్ట వేసింది.