Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంగారం, రాగి, మూల లోహాల ధరలు పెరిగాయి; ముడిచమురు ధరలు ఒత్తిడికి లోనయ్యాయి

బంగారం, రాగి, మూల లోహాల ధరలు పెరిగాయి; ముడిచమురు ధరలు ఒత్తిడికి లోనయ్యాయి
, శుక్రవారం, 8 మే 2020 (21:07 IST)
ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కూడా నలుగుతున్న ఆర్థికతకు మునుపటి రూపాన్ని తీసుకురావడానికి ఉత్పాదకతను తిరిగి ప్రారంభిస్తున్నాయి. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో మహమ్మారి కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో, ఇప్పటివరకు ఉధృతంగా ఉన్న నిరుద్యోగ తత్సంబంధిత ఆందోళనలు మెల్లగా వెనక్కు మళ్ళుతున్నాయి. ఈ పరిస్థితి, బంగారం, రాగితో పాటు మూల లోహాలకు అనుకూలంగా ఉంది, ఐతే గతవారంలో లాభాలు పొందిన ముడిచమురు కొద్దిగా చతికిల పడింది. 
 
బంగారం
లాక్ డౌన్ చర్యల సడలింపు కారణంగా అనేక బంగారు శుద్ధి కర్మాగారాలు తిరిగి తెరవడంతో గురువారం, స్పాట్ గోల్డ్ ధరలు 1.90 శాతం పెరిగి ఔన్సుకు 1717.7 డాలర్లకు చేరుకున్నాయి. ఇది, బంగారు సరఫరాలో, గణనీయమైన పెరుగుదల యొక్క మార్కెట్ అంచనాను పెంచింది. బంగారం ధరలపై భారం మోపింది.
 
అమెరికాలో నిరుద్యోగం ప్రబలంగా ఉంది, మార్చి 21, 2020 నుండి కరోనా మహమ్మారి సాధారణ జీవన విధానాన్ని పట్టాలు తప్పించడం మొదలుపెట్టినప్పటి నుండి మొత్తం 33 మిలియన్ల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. ఇంకా, డాలర్ అప్రియేషన్ అనేది ఇతర కరెన్సీ హోల్డర్లను ఖరీదైన బంగారం కొనకుండా ఉండటానికి పరిమితం చేయవచ్చు మరియు ధరలను తగ్గించవచ్చు.
 
వెండి
గురువారం, స్పాట్ సిల్వర్ ధరలు 3.8 శాతం పెరిగి ఔన్సుకు 15.5 డాలర్లకు చేరుకున్నాయి. ఎంసిఎక్స్ ధరలు 3.05 శాతం పెరిగి కిలోకు రూ. 43,123 వద్ద ముగిశాయి.
 
ముడి చమురు
గురువారం ముడి చమురు ధరలు 1.83 శాతం తగ్గి 23.6 డాలర్లకు చేరుకున్నాయి. కరోనావైరస్ వ్యాప్తి చెందడానికి,  ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం లాంటి పరిస్థితిని సృష్టించినందుకు అమెరికా, చైనా ప్రయోగశాలలను నిందించింది. అది ఇటువంటి చర్య అనిశ్చితులను పెంచింది, ముడి చమురు ధరలకు ఆటంకం కలిగించింది.
 
ముడిచమురు కోసం అధికారిక అమ్మకపు ధర (ఓ.ఎస్.పి) ను సౌదీ పెంచింది. మే నెలలో సౌదీ చేపట్టిన ముడి చమురు ఎగుమతి కోత కారణంగా ధరలకు కొంత మద్దతు లభించింది. ముడి చమురు ధరలకు పెద్ద దెబ్బ తగిలింది, లాక్ డౌన్ చర్యల కారణంగా విమాన మరియు రహదారి ప్రయాణ రద్దీ తగ్గింది. ఇటువంటి కార్యకలాపాల పరిమితి, ముడి చమురు ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది.
 
- ప్రథమేష్ మాల్యా, చీఫ్ ఎనలిస్ట్, నాన్ అగ్రి కమోడిటీస్ అండ్ కరెన్సీలు, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్‌కు కరోనా...