Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతీయ చిరు వ్యాపారాలకు దృశ్యమాన్యతను పెంపొందించడమే లక్ష్యంగా గో డాడీ నూతన ప్రచారం

Advertiesment
Godaddy
, మంగళవారం, 5 జులై 2022 (16:23 IST)
ప్రతిరోజూ వ్యాపారవేత్తలకు సాధికారితను కల్పిస్తూ, గోడాడీ నేడు నూతన ఇండియా మార్కెటింగ్‌ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ద్వారా ఆన్‌లైన్‌లో ఉనికిని చాటడం వల్ల కలిగే ప్రయోజాలను వెల్లడించడంతో పాటుగా ఆ వ్యాపారాలకు వాటి పరిమాణం మరియు ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా దృశ్యమాన్యతను సైతం సృష్టిస్తుంది. ఈ ప్రచారం ద్వారా మరింత మంది మహిళా వ్యాపారవేత్తలు ఆన్‌లైన్‌లో వెళ్లేందుకు, అవకాశాలను మరింత సమ్మిళితంగా మలిచేందుకు స్ఫూర్తి కలిగించడంతో పాటుగా సాధికారితను కల్పించడానికి ప్రయత్నిస్తుంది.
 
ఈ నూతన ప్రచారంలో మహిళా కథానాయిక, జైపూర్‌లోని ఓ రద్దీ మార్కెట్‌ వీధిలో  అన్వేషిస్తూ ఉంటారు. చిరు వ్యాపారాల నిర్లక్ష్యస్ధితి పట్ల నిరుత్సాహానిరి గురైన ఆమె, వారి వ్యాపారావకాశాలను వృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను వెల్లడిస్తూ ఓ వెబ్‌సైట్‌ను సృష్టిస్తారు. లేదంటే ఆఫ్‌లైన్‌లో మాత్రమే కార్యకలాపాలు నిర్వహించడం వల్ల లక్షలాది మందికి చేరువకాకుండా వీరంతా మిగిలిపోతారు.
 
ఈ ప్రచార టీవీసీ ప్రధానంగా వ్యాపార సంస్థలు ఆన్‌లైన్‌లో కార్యకలాపాలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను తెలుపుతూనే, గో డాడీ యొక్క ఏకీకృత పరిష్కారం ఏవిధంగా తోడ్పడుతున్నదీ వివరిస్తారు. చిరు వ్యాపార సంస్ధలకు ఆన్‌లైన్‌ ఉపకరణాలు మరియు పరిష్కారాలను అందిస్తోన్న సుప్రసిద్ధ సంస్ధ గోడాడీ. ఈ ప్రచారపు టీవీసీ మరింతగా గోడాడీ యొక్క మిషన్‌ను పునరుద్ఘాటించడంతో పాటుగా మా వినియోగదారులకు అవసరమైన ఉపకరణాలు, విషయాంశాలు అందిస్తుంది. అలాగే ప్రజలు తమ ఆలోచనలు, వ్యక్తిగత కార్యక్రమాలను విజయవంతంగా మలిచేందుకు సైతం తోడ్పడుతుంది.
 
ఇండియా మార్కెటింగ్‌ ప్రచారం గురించి గోడాడీ ఇండియా వీపీ-ఎండీ నిఖిల్‌ అరోరా మాట్లాడుతూ, ‘‘గోడాడీ వద్ద, మేము భారతదేశ వ్యాప్తంగా చిన్న, సూక్ష్మ మరియు మధ్య తరహా వ్యాపార సంస్థలను ఆన్‌లైన్‌లో తీసుకురావాలనుకుంటున్నాము. వేగవంతమైన డిజిటైజేషన్‌తో, మేము వ్యాపార యజమానులను నూతన మార్గాలను గురించి అన్వేషించాల్సిందిగా ప్రోత్సహిస్తున్నాము. వారు తమ వ్యాపారాల కోసం వెబ్‌సైట్‌ సృష్టించడంతో పాటగా ఆన్‌లైన్‌లో తమ వ్యాపార ఉనికిని ప్రదర్శించడం ద్వారా మరింత వ్యాపారం పొందగలరు.
 
భారతదేశపు ఎస్‌ఎంబీలు, ఎంఎస్‌ఎంఈల నడుమ అవగాహన మెరుగుపరిచేందుకు మాదైన మార్గం ఈ ప్రచారం. ఆన్‌లైన్‌లో ఉనికిని చాటడం ద్వారా మరింతగా సాధించవచ్చు. మరింతగా దూసుకుపోయేలా మహిళా వ్యాపారవేత్తలను మేము ప్రోత్సహించాలనుకుంటున్నాము. వారి విజయం స్థానికంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపగలదు. గోడాడీ వద్ద మేము వ్యవస్ధాపక స్ఫూర్తిని మరింతగా పెంపొందించేందుకు లక్ష్యంగా చేసుకున్నాము. తద్వారా  ఆన్‌లైన్‌ ఉపకరణాలు, సేవల సహాయంతో వారు తమ వ్యాపారాలను సృష్టించుకోవడం, వృద్ధి చేయడం మరియు నిర్వహించడంలో తోడ్పడగలము’’ అని అన్నారు.
 
చురుకైన, ఆకట్టుకునే, చమత్కారయుతమైన ఈ ప్రకటనను టియర్‌ 3 టౌన్‌ లోకల్‌ మార్కెట్‌ సెటప్‌లో చిత్రీకరించారు. ఇది చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలతో ప్రతిధ్వనిస్తుంది. ఈ ప్రకటనను ముంబై కేంద్రంగా కలిగిన క్రియేటివ్‌ ఏజెన్సీ టిల్ట్‌ బ్రాండ్‌ సొల్యూషన్స్‌ నేపథ్యీకరించడంతో పాటుగా అభివృద్ధి చేసింది. ఈ ప్రచారాన్ని హిందీ, గుజరాతీ, కన్నడ,మలయళం, మరాఠీ, తమిళ్‌ మరియు తెలుగు భాషలలో నిర్వహించనున్నారు. దీనిని టీవీ, ఎఫ్‌ఓఎస్‌, డిస్‌ప్లే, ఓఎల్‌వీ, సోషల్‌ మరియు పీఆర్‌ మీడియా మాధ్యమాల ద్వారా ప్రసారం చేస్తారు.
 
సమగ్రమైన ఆన్‌లైన్‌ ఉత్పత్తులను గోడాడీ అందిస్తుంది. వీటిలో డొమైన్‌ పేర్లు, హోస్టింగ్‌, వెబ్‌సైట్‌ బిల్డింగ్‌, ఇ-మెయిల్‌ మార్కెటింగ్‌, సెక్యూరిటీ ప్రొటెక్షన్స్‌, ఆన్‌లైన్‌ స్టోర్‌ వంటివి అందిస్తుంది. 24 గంటల వినియోగదారుల సేవా మద్దతును స్థానిక మరియు ప్రాంతీయ భాషలలో గోడాడీ అందిస్తుంది. తద్వారా  తమ వెంచర్‌లలో వినియోగదారులు వృద్ధి చెందేందుకు సైతం తోడ్పడుతుంది మరియు తమ అవసరాలు అత్యుత్తమంగా తీర్చే ఉపకరణాలను కనుగొనేందుకు సైతం తోడ్పడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాను క్లస్టర్లుగా విభజించిన బీజేపీ