అహ్మదాబాద్: ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ లిమిటెడ్(ప్రూడెంట్) ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజయ్ షా, తన వ్యక్తిగత హోల్డింగ్‌ల నుండి దాదాపు 650 మందికి సుమారు రూ. 34 కోట్లు (నేటి ధర ప్రకారం) విలువైన 175,000 ఈక్విటీ షేర్లను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. లబ్ధిదారులలో కంపెనీ ఉద్యోగులు, దాని పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థలు, అలాగే ఇంటి పనివారు, డ్రైవర్లు వంటి శ్రీ షా వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు.
వ్యాపారంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కృతజ్ఞతగా శ్రీ షా ఈ బహుమతి అందించనుండటంతో పాటుగా ఎలాంటి బాధ్యతలు లేదా నిలుపుదల షరతులు జతచేయలేదు. శ్రీ సంజయ్ షా ఈ నిర్ణయం గురించి కంపెనీకి తెలియజేశారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) సహా నియంత్రణ సంస్థల నుంచి అవసరమైన నియంత్రణ ఆమోదాలను కంపెనీ (అంటే ప్రూడెంట్) తీసుకుంది.
ఈ కార్యక్రమం గురించి శ్రీ సంజయ్ షా మాట్లాడుతూ, "ఇది కేవలం షేర్ల బదిలీ కాదు; ఈ ప్రయాణంలో ఉద్యోగులుగా మాత్రమే కాకుండా, సహచరులుగా నాతో పాటు నిలిచిన వారికి నాదైన రీతిలో చెప్పే హృదయపూర్వక కృతజ్ఞత . మీ నిశ్శబ్ద సహకారం, విధేయత, మా ఉమ్మడి లక్ష్యంపై నమ్మకం అమూల్యమైనవి, మన విజయానికి అవి పునాదిగా నిలిచాయి. మనం కలిసి సృష్టించే అద్భుతమైన భవిష్యత్తు కోసం నేను ఆసక్తిగా ఉన్నాను" అని అన్నారు. కాటలిస్ట్ అడ్వైజర్స్ లావాదేవీకి సలహాదారుగా వ్యవహరించారు మరియు SEBI నుండి సంబంధిత ఆమోదాలను కోరారు.