Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ, తెలంగాణ మార్కెట్లోకి జౌలెస్ హెల్త్ ఎన్ఒసిడి ఎనర్జీ డ్రింక్

Advertiesment
ఏపీ, తెలంగాణ మార్కెట్లోకి జౌలెస్ హెల్త్ ఎన్ఒసిడి ఎనర్జీ డ్రింక్
, సోమవారం, 21 సెప్టెంబరు 2020 (20:38 IST)
తిరుపతి: పండగ సీజన్లో జౌలెస్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సరికొత్త ఎనర్జీ డ్రింక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కార్బన్ రహిత-ఎన్ఒసిడి ఎనర్జీ డ్రింక్ ఇది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రస్తుత జీవనశైలి, వస్తున్న ఆరోగ్యసమస్యలపై పోరాడేలా అధ్బుతమైన పోషకాలతో కూడిన డ్రింక్ ఇది. దేశంలోని అన్ని మల్టీబ్రాండ్ రిటైల్ షాపుల్లోనూ అందుబాటులో ఉంటుంది. దేశంలో ఫస్ట్ టైం బ్రాంచ్ చెయిన్ అమినో యాసిడ్స్-బిసిసిఎతో తయారైంది ఇది. దీనినే మజిల్స్ బ్లాక్స్‌గా చెబుతుంటారు.
 
ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో ఉన్న హెల్త్ డ్రింక్‌తో పోల్చితే ఇది హెల్తీ. ఎన్ఒసిడి కారణంగా వ్యాధి నిరోధకశక్తి, మజిల్, మెదడు పనితీరు మెరుగుపడతాయి. అంతేకాదు శరీర ఛాయ, జుట్టును నిగారింపజేస్తుంది. ఖచ్చితంగా ఇది జీవనశైలికి పర్ఫెక్ట్ డ్రింక్ అవుతుంది. కాఫీ, కాఫీ సంబంధిత ఉత్పత్తులకు వందశాతం ప్రత్యామ్నాయం ఎన్ఒసిడి డ్రింక్. ఇందులో ఉండే గ్రీన్ కాఫీ  బీన్స్ మీలోని ఎనర్జీ లెవల్స్ పెంచడంతో పాటు ఫ్యాట్‌ను తగ్గిస్తుంది.
 
విభిన్నమైన అనుభూతులు పంచే ఆరోగ్యకరమైన ఇన్నోవేటివ్ ఉత్పత్తులు అందించాలన్నది తమ మౌలిక సిద్దాంతమని జౌలెస్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ మరియు సీఈఓ సిద్దార్ధ మిశ్రా అభిప్రాయపడ్డారు. అధికారికంగా ఆయన ప్రోడక్ట్ ను విడుదల చేశారు. ఎన్ఒసిడి ఎనర్జీ డ్రింక్ మార్కెట్లోకి తీసుకరావడం పట్ల ఎంతో ఆనందంగా ఉందన్నారు.
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఫస్ట్ ఫన్ ఎనర్జీ హెల్త్ డ్రింక్ ఇదేనన్నారు మిశ్రా. ప్రజల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో పెట్టుకుని తయారుచేస్తున్న మా ఉత్పత్తులకు అందరి నుంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయన్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులు, మరియు ఫిజీ బేవరేజెస్ లో ఉండే సమస్యలను, లోపాలను గుర్తించి.. వాటికి దూరంగా దేశీయ వినియోదారుల కోసం వారి ఆరోగ్యాన్ని ద్రుష్టిలో పెట్టుకుని ఎన్ఒసిడిని మార్కెట్లో విడుదల చేస్తున్నామన్నారు సీఈఓ సిద్దార్థ మిశ్రా.
 
కోలా మరియూ బెర్రీ అనే రెండు ప్రత్యేకమైన ఫ్లేవర్స్‌లో ఎన్ఒసిడి డ్రింక్ అందుబాటులో ఉంటుంది. 250 మి.లీ. టిన్ ధర రూ.110. రీసైకిలబుల్ అల్యూమినియంతో తయారైన ఆకర్షణీయమైన క్యాన్స్ ద్వారా మార్కెట్లో విడుదల చేస్తున్నారు. దశల వారీగా మరికొన్ని ఫ్లేవర్స్ లో కూడా ఎన్ఒసిడి ఎనర్జీ డ్రింగ్ మార్కెట్లో విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసింది కంపెనీ. ఎన్ఒసిడి ఇండియాలోనే తొలిసారి నాచురల్ కెఫీన్ తో తయారైన రిక్రియేషనల్ థర్మోజెనిక్ ఎనర్జీ డ్రింక్.
 
అంతేకాదు బిసిఎఎ, రకరకాల విటమిన్లు, మినరల్స్ జత చేయబడ్డాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ కూడా అధ్బుతంగా పనిచేస్తాయి. వ్యాధి నిరోధకశక్తిని, మెటబాలిజాన్ని పెంపొందిస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉంచుతుందని క్లినికల్‌గా నిరూపించబడింది. ఫోలిక్ యాసిడ్, బయోటిన్, ఎల్-కార్నిటైన్, మల్టీ విటమిన్ వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలాలో పడిపోయిన సుమేధ.. కేటీఆర్‍పై ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు