Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్యూచర్ జనరలి ఇండియా లైఫ్ ఇన్స్యూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా అలోక్ రుంగ్తా నియామకం

Advertiesment
Alok Rungta

ఐవీఆర్

, శుక్రవారం, 1 మార్చి 2024 (21:52 IST)
తమ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా అలోక్ రుంగ్తాను నియమిస్తున్నామనీ, నియంత్రణ సంస్థల నుంచి అవసరమైన ఆమోదాలను పొందడానికి లోబడి, ఇది 1 ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తుందని ఫ్యూచర్ జనరలి ఇండియా లైఫ్ ఇన్స్యూరెన్స్ ఈ రోజు ప్రకటించింది. ప్రస్తుతం డిప్యూటీ సిఇఓ, సిఎఫ్ఓగా సేవలు అందిస్తున్న అలోక్ తన అనుభవం, నైపుణ్యాల సంపదను తన కొత్త పాత్రలోకి తీసుకురాబోతున్నారు. 2024 మార్చి 31 వరకూ ఎండి & సిఇఓగా వ్యవహరించే బ్రూస్ డి బ్రోయిజ్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.
 
ఈ సందర్భంగా జనరలీ సిఇఓ ఇంటర్నేషనల్ జైమ్ అంచుస్టెగుయ్ మెల్గరెజో మాట్లాడుతూ “ఎండి & సిఇఓగా అలోక్ నియామకం ఫ్యూచర్ జెనరలి ఇండియా లైఫ్ ఇన్స్యూరెన్స్‌కు ఒక ముఖ్యమైన ఘట్టం. ఆయన నాయకత్వ నైపుణ్యాలు, విభిన్న మార్కెట్లపై లోతైన అవగాహన కంపెనీని నిరంతర వృద్ధి దిశగా నడిపించడానికి ఆయనకు ఎంతో ఉపయోగపడతాయి. ఒక గ్రూప్‌గా, మా ఉద్యోగులు తమ పూర్తి స్థాయి సామర్థ్యాన్ని అందుకోవడానికి, అదే సమయంలో తమ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను, అనుభవాన్ని అందించడానికి రూపొందించిన అభివృద్ధి కార్యక్రమాల్లో మేము నిరంతరం పెట్టుబడి పెడుతున్నాం. అలోక్ ఎదుగుదల ఒక సమర్థవంతమైన ప్రణాళిక విజయానికి నిజమైన నిదర్శనం” అని చెప్పారు.
 
జనరలి రీజనల్ ఆఫీసర్ ఇంటర్నేషనల్- ఆసియా రాబ్ లియోనార్డీ మాట్లాడుతూ “ఫ్యూచర్ జనరలి ఇండియా లైఫ్ ఇన్స్యూరెన్స్‌కు తన అసాధారణమైన నాయకత్వాన్నీ, అమూల్యమైన సేవలను అందించిన బ్రూస్‌కు మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా కంపెనీకి కొత్త ఎండి & సిఇఓగా అలోక్‌ని మేము ఆహ్వానిస్తున్నాం. వృద్ధిని లాభదాయకతను పెంచడంలో నిరూపితమైన ఆయన సామర్థ్యం భారతీయ మార్కెట్ విషయంలో వ్యూహాత్మక దృష్టికి తోడై వినూత్న బీమా పరిష్కారాలను అందించే మా నిబద్ధతకు తిరుగులేని దోహదకారిగా నిలుస్తోంది. ఆయన మార్గదర్శకత్వంలో కంపెనీ సాఫల్యత, విస్తరణలకు సాక్ష్యంగా నిలవాలని మేము ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం” అని చెప్పారు.
 
బీమా పరిశ్రమకు చెందిన విభిన్న మార్కెట్లలో రెండు దశాబ్దాలుగా విస్తరించిన విస్తృతమైన నేపథ్యంతో, అలోక్ గతంలో పనిచేసిన కంపెనీలకు తన విలువైన నైపుణ్యాన్ని జోడించారు. 2023 ఫిబ్రవరి నుంచి ఫ్యూచర్ జనరలి ఇండియా లైఫ్ ఇన్స్యూరెన్స్ లో డిప్యూటీ సిఇఓ & చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌(సిఎఫ్ఓ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తన ప్రస్తుత పాత్రలో కంపెనీ వృద్ధికి ఆయన విశేషమైన సహకారం అందించారు. ఇంతకుముందు ఆయన ఫిలిప్పీన్స్, హాంకాంగ్‌లతో పాటు భారతదేశంలోని ప్రముఖ బీమా కంపెనీలలో ఎగ్జిక్యూటివ్ పదవులను నిర్వహించారు, ఇది నాయకత్వ ప్రయాణం దిశగా అంకితభావంతో కూడిన ఆయన వృత్తి జీవితానికి నిదర్శనం. 
 
తన కొత్త పాత్ర గురించి మాట్లాడుతూ, తన కృతజ్ఞతలను తెలియజేసిన అలోక్ “ప్యూచర్ జనరలి ఇండియా లైఫ్ ఇన్స్యూరెన్స్‌ లో ఒక భాగంగా, నాయకత్వ స్థానంలోకి ఎదగడం ఒక గౌరవం, ఒక పురోగతి కూడా. నాకన్నా ముందు ఆ బాధ్యతలు నిర్వహించినవారి చక్కటి కృషిని కొనసాగించడానికి, స్థిరమైన వృద్ధి మీద దృష్టి కేంద్రీకరించి, ఒక వైవిధ్యాన్ని సృష్టించడానికి నేను కట్టుబడి ఉన్నాను. క్రియాశీలమైన భారతీయ మార్కెట్‌లో అగ్రగామిగా కొత్త ఆలోచనలను తీసుకురావడం, మా పరిధిని విస్తరించడం, మా వినియోగదారుల, భాగస్వాముల జీవితాలకు మేము విలువను జోడించడం నా లక్ష్యం” అని చెప్పారు.
 
ఫ్యూచర్ జనరలి ఇండియా లైఫ్ ఇన్స్యూరెన్స్ దేశవ్యాప్తంగా ఉన్న తన వినియోగదారులకు వినూత్న బీమా పరిష్కారాలను, అసాధారణమైన సేవలను అందించాలనే తన నిబద్ధతకు స్థిరంగా కట్టుబడి ఉంది. అలోక్ నాయకత్వంలో, వృద్ధి , విజయాల కొత్త శకాన్ని ప్రారంభించేందుకు కంపెనీ ఎదురుచూస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ యాప్ డెవలపర్లకు టెక్ దిగ్గజం గూగుల్ వార్నింగ్