Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#BoycottUberEats ట్రెండింగ్ నెం.1.. ఎందుకని?

Advertiesment
#BoycottUberEats ట్రెండింగ్ నెం.1.. ఎందుకని?
, గురువారం, 1 ఆగస్టు 2019 (11:41 IST)
ట్విట్టర్‌లో కొత్త హ్యాష్ ట్యాగ్ కనబడుతోంది. #BoycottUberEats అనే ఈ హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ నెంబర్ వన్‌గా వుంది. దీనికి కారణాలు లేకపోలేదు. భారత్‌లో ఫుడ్ డెలివరీ యాప్స్‌లో తనదైన ప్రత్యేకత చాటుకుంటున్న జొమాటో... తాజాగా ప్రజలకు మరింత దగ్గరైంది. కారణం ఓ కస్టమర్ చేసిన రిక్వెస్ట్. తాను ఆర్డర్ ఇచ్చిన ఫుడ్‌ని హిందూ మతానికి చెందిన వ్యక్తితోనే పంపాలని ఆ కస్టమరో కోరారు.
 
ఈ రిక్వెస్ట్‌కి జొమాటో కుదరదని తేల్చిచెప్పింది. ఫుడ్‌కి మతంతో పనిలేదన్న జొమాటో... ముస్లిం డెలివరీ పర్సన్‌తోనే ఆహారం పంపుతామని స్పష్టం చేసింది. అతన్ని మార్చేది లేదని క్లారిటీ ఇచ్చింది. కానీ ఆ కస్టమర్‌ తాను చేసిన ఆర్డర్‌ను రద్దు చేసుకున్నాడు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది జొమాటో. హిందువు కాని వ్యక్తి ఫుడ్ డెలివరీ చేస్తున్నాడని ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసిన విషయాన్ని స్పష్టం చేసింది. 
 
ఈ ట్వీట్‌పై ఆర్డర్ ఇచ్చిన మధ్యప్రదేశ్... జబల్పూర్‌కి చెందిన అమిత్ శుక్లా వెంటనే స్పందించారు. ఈ ట్వీట్‌పై ఆర్డర్ ఇచ్చిన మధ్యప్రదేశ్... జబల్పూర్‌కి చెందిన అమిత్ శుక్లా వెంటనే స్పందించారు. "ఆర్డర్ రద్దు చేసినా... మీరు డబ్బు తిరిగి ఇవ్వలేమని అన్నారు. ఫుడ్ తీసుకోవాల్సిందేనని మీరు ఎలా ఒత్తిడి చేస్తారు? అలా చెయ్యలేరు" అని శుక్లా ట్వీట్ చేశారు.
 
జొమాటో వ్యవస్థాపకుడు దీపీందర్ గోయల్ దీనిపై స్పందించారు. ఇండియాలో భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం ఉండటంపై గర్వపడుతున్నామన్నారు. వ్యాపారం కోసం విలువల్ని వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. 
 
జొమాటో నిర్ణయాన్ని ప్రముఖులు, నెటిజన్లు మెచ్చుకున్నారు. జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఖురేషి లాంటి ప్రముఖులు ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. అదే సమయంలో ఆర్డర్ రద్దు చేసుకున్న శుక్లాపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. మరోవైపు #BoycottUberEats అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఉబెర్ ఈట్స్‌ను బైకాట్ చేయాల్సిందిగా కొందరు డిమాండ్ చేస్తున్నారు. కానీ చాలామంది ఉబెర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిక్‌టాక్‌ ఉప్పల్ బాబు.. ఆకతాయి ఆ పనిచేస్తే.. కామ్‌గా వెళ్ళిపోయాడు..