Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 29 March 2025
webdunia

దీపావళిలో ఆఫర్ల కోసం ఆన్‌లైన్‌ వైపు చూస్తున్న పండుగ షాపర్లు: మెటా యొక్క ఫెస్టివ్‌ మార్కెటింగ్‌ గైడ్‌

Advertiesment
shopping mall
, గురువారం, 29 సెప్టెంబరు 2022 (17:38 IST)
మెటా నేడు తమ వార్షిక కన్స్యూమర్‌ ఇన్‌సైట్స్‌ నివేదికను 2022 పండుగ సీజన్‌ కోసం విడుదల చేసింది. ఈ నివేదిక వెల్లడించే దాని ప్రకారం భారీ సంఖ్యలో పండుగ షాపర్లు నూతన బ్రాండ్లు, ఉత్పత్తులు, ఆఫర్లను ఈ దీపావళి కోసం ప్రయత్నించాలనుకుంటున్నారు. ఈ నివేదిక వెల్లడించే దాని ప్రకారం 93% మంది దీపావళి షాపర్లు ఈ హాలీడే సీజన్‌లో నూతన బ్రాండ్‌ను ప్రయత్నించాలనుకుంటుంటే, 80%కు పైగా దీపావళి కొనుగొలుదారులు ఇప్పుడు నూతన బ్రాండ్లు, ఉత్పత్తులను ఆన్‌లైన్‌ లో కనుగొంటున్నారు. ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం79%పైగా దీపావళి షాపర్లు మెటా టెక్నాలజీస్‌పై నూతన ఉత్పత్తులు మరియు బ్రాండ్లను కనుగొంటున్నారు.
 
ఈ అధ్యయన ఫలితాలను మెటా కోసం యుగవ్‌ చేసిన అధ్యయనం ద్వారా కనుగొన్నారు. ఈ అధ్యయనం ద్వారా పండుగ షాపింగ్‌ వ్యాప్తంగా మారుతున్న వినియోగదారుల ధోరణులను లోతుగా అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో కనుగొనబడిన కీలకమైన ధోరణుల ప్రకారం, భారతీయ పండుగ షాపర్లు అధికంగా ఇన్ల్ఫూయెన్సర్‌ ఆధారిత కంటెంట్‌, షార్ట్‌ ఫార్మ్‌ వీడియోలు, మెసేజింగ్‌ మరియు ఇంటరాక్టివ్‌ ఫార్మాట్లు అయినటువంటి ఏఆర్‌ వంటి వాటి చేత ప్రభావితమవుతున్నారు. ఈ అంశాలే 2022 లో దీపావళి షాపర్‌కు ఆసక్తి కలిగించడంతో పాటుగా వారి శ్రద్ధనూ పొందేందుకు కీలకమవుతున్నాయి.
 
మెటా వద్ద గ్లోబల్‌ బిజినెస్‌ గ్రూప్‌ (ఇండియా) డైరెక్టర్‌ అరుణ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ‘‘ఈ పండుగ సీజన్‌లో ఆశాజనక వాతావరణం కనిపిస్తుంది. ఇది వ్యాపారసంస్థలకు ఓ వరంగా నిలువనుంది. చిన్న, భారీ సంస్ధలు అత్యంత సవాల్‌తో కూడిన సూక్ష్మ ఆర్థిక వాతావరణంలో పెనుసవాళ్లు ఎదుర్కొంటున్న వేళ ఇది శుభ పరిణామం. మేము ఇప్పటికే వ్యాపార సంస్థలతో కలిసి ఉత్సాహ పూరితమైన పనిని ఈ పండుగ సీజన్‌ ప్రచారాలలో భాగంగా ప్రారంభించాము.  వినియోగదారులను చేరుకునేందుకు అత్యంత శక్తివంతమైన మార్గంగా డిజిటల్‌ నిలుస్తుంది. అది ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో వినియోగదారుడు కొనుగోలు చేయాలనుకున్నప్పటికీ అది ప్రభావం చూపుతుంది. మెటా సాంకేతికతలు ఈ దిశగా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. దాదాపు 440 మిలియన్ల మంది భారతీయులు కేవలం ఫేస్‌బుక్‌పై ఉండటం ద్వారా దీనిని సాధ్యం చేస్తున్నారు'' అని అన్నారు
 
వేవ్‌ మేకర్‌ ఇండియా, చీఫ్‌ డిజిటల్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌- విశాల్‌ జాకోబ్‌ మాట్లాడుతూ, ‘‘గత 2-3 సంవత్సరాలలో భారీ డిజిటల్‌ స్వీకరణ, గణనీయంగా వినియోగదారుల ప్రవర్తనను సైతం మార్చింది. దీనితో సుప్రసిద్ధ బ్రాండ్లు కూడా తమ పండుగ ప్లానింగ్‌ ఏవిధంగా చేయాలనేది పునరాలోచిస్తున్నాయి. సామాజిక, వాణిజ్య వేదికల వద్ద డిజిటల్‌ వేదికలు విభిన్న విభాగాల వ్యాప్తంగా మార్కెటీర్ల శ్రద్ధను ఆకర్షిస్తుండటం చూశాము. సరైన కమ్యూనికేషన్‌తో వినియోగదారులను ఖచ్చితత్త్వంతో చేరుకోవడమనేది విజయానికి అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇది గందరగోళాన్ని తొలగిస్తుంది. దీనికోసం ఫేస్‌బుక్‌ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లు సరైన వేదికలుగా నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా డీ2సీ బ్రాండ్లుకు ఇవి తోడ్పడుతున్నాయి’’అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్యాస్ సిలిండర్లపై లిమిట్ విధిస్తే ఇంకేముంది..?