Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లలో ఆఫర్లే ఆఫర్లు... కీపాను ఉపయోగించి..?

Advertiesment
amazon great indian festival
, గురువారం, 22 సెప్టెంబరు 2022 (14:17 IST)
దసరా, దీపావళి వచ్చిందంటే ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లలో ఆఫర్లే ఆఫర్లు. తాజాగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు ఈ నెల 23 నుంచి సేల్‌కు సిద్ధమవుతున్నాయి. ఒకవేళ సేల్స్‌లో పాల్గొనే ఉద్దేశం ఉంటే.. మీరు కొనాలనుకుంటున్న వస్తువు ప్రైస్‌ హిస్టరీని సులువుగా తెలుసుకోవచ్చు. 
 
ఇందుకోసం ఎక్స్‌టెన్షన్‌ను వాడాల్సి ఉంటుంది. ఇవి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌కు వేర్వేరుగా ఉంటాయి. ఒకసారి ఈ ఎక్స్‌టెన్షన్‌ను మీ బ్రౌజర్‌కు యాడ్‌ చేశాక.. సైట్‌ ఓపెన్‌ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్‌ కింద ఆ వస్తువు ప్రైస్‌ హిస్టరీ తెలుసుకోవచ్చు. అయితే, డెస్క్‌టాప్‌ లేదా ల్యాప్‌టాప్‌లో మాత్రమే తెలుసుకునే వీలుంది. యాప్‌లో తెలుసుకునే వసతిలేదు.
 
అమెజాన్‌ వెబ్‌సైట్‌లో ఏదైనా వస్తువు ప్రైస్‌హిస్టరీ తెలుసుకోవాలంటే కీపా (keepa) అనే ఎక్స్‌టెన్షన్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌, గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్లకు ఈ ఎక్స్‌టెన్షన్‌ అందుబాటులో ఉంది. వీటిని ఒకసారి మీ బ్రౌజర్‌కు యాడ్‌ చేసిన తర్వాత ప్రొడక్ట్‌ను ఓపెన్‌ చేసినప్పుడు కాస్త దిగువ భాగంలో ఓ ఛార్ట్‌ దర్శనమిస్తుంది. అందులో ఏ రోజు ఎంతెంత ధర ఉందో తెలుసుకోవచ్చు.


ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌లోనూ మీరు ఏదైనా వస్తువు ప్రైస్‌ హిస్టరీ తెలుసుకోవాలంటే అందుకు ప్రైస్‌ ట్రాకర్‌ (Price tracker) అనే ఎక్స్‌టెన్షన్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. గూగుల్‌ క్రోమ్‌ యూజర్లు దీన్ని వాడుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియురాలితో భర్తకు వివాహం చేయించిన భార్య.. ఎక్కడ?