అగ్రరాజ్యం అమెరికా సర్కారు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. నెవార్క్ నుంచి ముంబై వెళ్లాల్సిన విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. . తమ అధీనంలో ఉన్న గగనతలంలోకి అమెరికా డ్రోన్ ప్రవేశించిందంటూ, ఇరాన్ ఆ డ్రోన్‌ను కూల్చివేయడమే.
దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇరాన్ అధీనంలోని గగనతలం మీదుగా అమెరికా విమానాలు వెళ్లవద్దని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
ప్రయాణికుల భద్రత దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా ఏవియేషన్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ప్రయాణీకులు ప్రత్యామ్నాయాలను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాగా, యునైటెడ్ ఎయిర్ లైన్స్‌తో పాటు అమెరికన్ ఎయిర్ లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్ కూడా ఇరాన్ మీదుగా తాము నడిపే విమానాలను రద్దు చేసుకున్నాయి. ఇకపోతే.. యునైటెడ్ ఎయిర్ లైన్స్ నడపాల్సిన విమానాలు రద్దు కాగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.