Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇపిఎల్ వారి నిర్వహణనీయ పరిష్కారాలకి యూనిలివర్‌తో ఆమోదం

Advertiesment
ఇపిఎల్ వారి నిర్వహణనీయ పరిష్కారాలకి యూనిలివర్‌తో ఆమోదం
, గురువారం, 3 జూన్ 2021 (16:30 IST)
ప్రపంచ అతిపెద్ద స్పెషాలిటీ ప్యాకింగ్ కంపెనీ అయిన ఇపిఎల్ లిమిటెడ్ (ఇంతకు ముందు ఎస్సెల్ ప్రోప్యాక్ లిమిటెడ్‪గా పరిచితమైనది), ఓరల్ కేర్ విభాగంలో 100% నిర్వహణీయత సాధించే ప్రయాణంలో భాగంగా యూనిలివర్ తమని భాగస్వామిగా ఎంచుకున్నట్టు ఈరోజు ప్రకటించింది. తదనుగుణంగా, ఇపిఎల్ తమ ఎపిఆర్ అనుమతిపొందిన, 100% పునరుపయోగితమైన, పూర్తి నిర్వహణనీయమైన ప్లాటినా ట్యూబ్స్‪ని, యూనిలివర్ వారి టూత్‪పేస్ట్ విభాగం కోసం సరఫరా చేయనుంది.
 
హెచ్‪డిపిఇ క్లోజర్‌తో వుండే ఇపిఎల్ వారి ప్లాటినా ట్యూబ్స్, ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి పూర్తి నిర్వహణనీయమైన, పూర్తిగా పునరుపయోగితమైనదిగా ఎపిఆర్ నుంచి గుర్తింపు పొందినది. ఇది, యూనిలివర్ వారి ఓరల్ కేర్ బ్రాండ్స్ అయిన సిగ్నల్, పెప్సోడెంట్, క్లోజప్ వంటివి 2025 నాటికల్లా పూర్తి పునరుపయోగితమైనవాటిగా తయారవడానికి దోహదపడుతుంది.
 
ఈ భాగస్వామ్యం కుదిరిన సందర్భంగా, రామ్ రామసామి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఇపిఎల్ లిమిటెడ్, మాట్లాడుతూ, "ఓరల్ కేర్ శ్రేణిలో వారి నిర్వహణీయతని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి యూనిలివర్‪తో భాగస్వామ్యం కూడినందుకు ఇపిఎల్ గర్వపడుతోంది. ప్యాకింగ్‪లో సృజనాత్మకత ద్వారా భాధ్యతాయుతమైన వినియోగానికి స్ఫూర్తినివ్వడానికి, వీలు కల్పించడానికి మేం కట్టుబడి వున్నాం. పర్యావరణ అనుకూల లామినేటెడ్ ట్యూబ్ అయిన ఇపిఎల్ వారి ప్లాటినా, 5% కన్నా తక్కువ బారియర్ రెసిన్‌తో తయారవుతుంది, బారియర్ లక్షణాలు ఏవీ పోకుండానే పునరుపయోగితాన్ని సాధించడానికి, సోర్స్ రిడక్షన్ అందించడానికి వీలుగా రూపుదిద్దింది. ప్లాటినా ట్యూబ్ ముఖ్యంగా ఓరల్, బ్యూటీ & కాస్మొటిక్స్ ఉత్పత్తి బ్రాండ్స్ కి తగినది" అన్నారు.
 
దీపక్ గంజూ, రీజినల్ వైస్ ప్రెసిడెంట్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ అండ్ సౌత్ ఆసియా, ఇపిఎల్ లిమిటెడ్, మాట్లాడుతూ, “పర్యావరణంపై అనుకూల ప్రభావం చూపించడానికి అన్వేషిస్తున్న, ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక బ్రాండ్లలో ఒకదానితో భాగస్వామ్యం కూడినందుకు ఇపిఎల్ గర్వపడుతోంది. ఇపిఎల్ లో నిర్వహణీయత అనేది కీలకంగా దృష్టిసారించిన అంశం, బాధ్యతాయుతమైన అన్ని బ్రాండ్లూ ఆ దిశగా కదలడాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. నిర్వహణీయ అభివృద్ధికి, బ్రాండ్స్ కి దోహదం చేసేందుకు మార్కెట్ లీడర్ గా ఇపిఎల్ కీలకమైన పాత్ర పోషించాల్సి వుంటుంది.”
 
తమ అతిపెద్ద ఓరల్ కేర్ మార్కెట్లలో రెండైన, ఫ్రాన్స్, భారతదేశాల్లో యూనిలివర్ వారు పూర్తి పునరుగయోగిత బ్యూబ్ లని ఈ ఏడాది ప్రవేశపెట్టనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆన్‌లైన్‌లో ఆనందయ్య మందు: కుండబద్ధలు కొట్టిన కొడుకు శశిధర్