Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖాతాదారులకు షాకిచ్చిన ఈపీఎఫ్ - 40 యేళ్ళ కనిష్టానికి...

ఖాతాదారులకు షాకిచ్చిన ఈపీఎఫ్ - 40 యేళ్ళ కనిష్టానికి...
, శనివారం, 12 మార్చి 2022 (15:03 IST)
ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌వో) తన ఖాతాదారులకు తేరుకోలేని విధంగా షాకిచ్చింది. ఈపీఎఫ్‌వో వడ్డీ రేట్లను 8.5 శాతం నుంచి 8.1 శాతానికి గణనీయంగా తగ్గించింది. అంటే 16 యేళ్ల క్రితం ఉన్న వడ్డీ రేట్లపై ఇకపై అందివ్వనుంది. 2021-22 సంవత్సరానికిగాను 8.1 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
అంతకుముందు 8.5 శాతంగా ఉంది. తగ్గింపు నిర్ణయం వల్ల దాదాపు 6 కోట్ల మంది పీఎఫ్ చందాదారులపై ప్రభావంపడనుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ సంస్థ ఆదాయం రూ.76,768 కోట్లుగా ఉందని, అందుకే వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చిందని ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ మెంబర్ మైఖేల్ డయాస్ వెల్లడించారు. 
 
కాగా, గత 1977-78 తర్వాత ఇంత తక్కువగా వడ్డీని చెల్లించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆ యేడాది పీఎఫ్‌పై 8 శాతం వడ్డీని చెల్లించారు. 2018-19, 2016-17లలో 8.65 శాతం చొప్పున వడ్డీని జమచేశారు. 2013-14, 2014-15లో 8.75 శాతం, 2015-16లో 8.8 శాతం చొప్పున చెల్లించారు. 
 
అయితే, కరోనా మహమ్మారి సమయంలో నగదు ఉపసంహరణలు పెరగడంతో చందాదారుల నుంచి జమయ్యే సొమ్ము భారీగా తగ్గింది. దీంతో 2019-2020కిగాను 8.5 శాతానికి వడ్డీని తగ్గించారు. ఇపుడు దీన్ని 8.1 శాతంగా తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐఏఎంసీ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎన్వీ రమణ