Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరుసగా మూడో ఏడాది ‘నెం.1 గ్లోబల్ డెస్టినేషన్’గా నిలిచిన దుబాయ్

Dubai named ‘No.1 global destination

ఐవీఆర్

, గురువారం, 11 జనవరి 2024 (19:57 IST)
ట్రిప్ ఎడ్వైజర్ ట్రావెలర్స్ ఛాయిస్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్ అవార్డ్స్‌లో అపూర్వమైన రీతిలో వరుసగా మూడవ సంవత్సరానికి దుబాయ్ నంబర్.1 గ్లోబల్ డెస్టినేషన్ ర్యాంకింగ్‌ను పొందింది. తద్వారా ఈ మైలురాయిని సాధించిన మొదటి నగరంగా అవతరించింది. దుబాయ్ యొక్క తాజా అత్యుత్తమ అంతర్జాతీయ ర్యాంకింగ్‌నును ప్రపంచంలోనే అతిపెద్ద ట్రావెల్ గైడెన్స్ ప్లాట్‌ఫారమ్ అయిన ట్రిప్ ఎడ్వైజర్ తన ట్రావెలర్స్ ఛాయిస్ అవార్డ్స్ 2024లో : బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్స్  ప్రకటించింది. ట్రిప్ ఎడ్వైజర్ కమ్యూనిటీలోని మిలియన్ల మంది గ్లోబల్ ప్రయాణికుల సమీక్షల ఆధారంగా ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన విజేతల కారణంగా ఈ ప్రశంస మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. 1 అక్టోబర్ 2022 నుండి 30 సెప్టెంబర్ 2023 మధ్య 12 నెలల వ్యవధిలో ప్రతి గమ్యస్థానంలో హోటల్‌లు, రెస్టారెంట్‌లు, అనుభవాల కోసం ట్రిప్ ఎడ్వైజర్ సమీక్షలు, రేటింగ్‌ల నాణ్యత, పరిమాణం సైతం ఈ అవార్డులలో పరిశీలించారు. 
 
దుబాయ్ కార్పొరేషన్ ఫర్ టూరిజం అండ్ కామర్స్ మార్కెటింగ్ (విజిట్ దుబాయ్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇస్సామ్ కాజిమ్ మాట్లాడుతూ, “సురక్షితమైన, భద్రమైన, సులభంగా చేరుకోగల గమ్యాన్ని కోరుకునే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులు, కుటుంబాలు- థ్రిల్ కోరుకునే వారు దుబాయ్ యొక్క విభిన్న ఆఫర్‌లను స్వీకరించారు. వ్యాపార సందర్శకులను, సాంస్కృతిక అన్వేషనలను కోరుకునేవారు, నగరంలో మాత్రమే కనుగొనగలిగే ప్రత్యేక అనుభవాలను గుర్తిస్తారు.
 
వినియోగదారుల డిమాండ్లు, ట్రెండ్‌లు మరింత అభివృద్ధి చెందడంతోపాటు, ట్రిప్ ఎడ్వైజర్, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా, అలాగే నేరుగా నగరంలోనే పర్యాటకుల నుండి మేము స్వీకరించే అభిప్రాయాల సహాయంతో, మేము నగరం యొక్క ఆఫర్‌లు, సేవలలో అత్యున్నత ప్రమాణాలను కొనసాగించడానికి పని చేస్తూనే ఉంటాము" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుప్పూర్‌లో పరువు హత్య.. కన్నకూతురిని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు..