Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2023లో విశేషమైన మైలురాళ్లను సాధించిన డెలివరూ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్

Deliveroo’s India Development Centre

ఐవీఆర్

, బుధవారం, 31 జనవరి 2024 (20:26 IST)
డెలివరూ యొక్క గ్లోబల్ టెక్ ల్యాండ్‌స్కేప్‌లో కీలకమైన డెలివరూ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (IDC)లోని హైదరాబాద్ బృందం 2023లో  అపూర్వమైన విజయాలు, ముఖ్యమైన మైలురాళ్లను సాధించింది. ఐడిసి నిలకడగా అత్యుత్తమ సాంకేతిక ప్రతిభను సంపాదించుకుంది, గ్లోబల్ డెలివరూ విజయాల్లో కీలక పాత్ర పోషించిన కీలకమైన సాంకేతికాభివృద్ధిని చేసింది.
 
ఫ్రంట్-ఎండ్, బ్యాక్-ఎండ్, ఫుల్ స్టాక్, మొబైల్, DevOps, అనలిటిక్స్, ప్రొడక్ట్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి వివిధ రంగాలలో నిపుణులను నియమించుకోవడంపై దృష్టి సారించిన ఐడిసి యొక్క వర్క్‌ఫోర్స్ అద్భుతమైన రీతిలో 125% వృద్ధిని సాధించింది. అంతేకాకుండా, ఐడిసి 24% అధిక లింగ వైవిధ్య రేటును సాధించింది, ఇది శ్రామిక శక్తి, ఇంజనీరింగ్ రంగంలో మహిళలకు బలమైన ప్రాతినిధ్యాన్ని నిర్ధారిస్తుంది. 2023 ప్రారంభంలో, కంపెనీ తమ గ్లోబల్ ఉమెన్ ఇన్ టెక్ ఎంప్లాయీ రిసోర్స్ గ్రూప్ (ERG)లో భాగంగా 'ఇండియా ఉమెన్ ఇన్ టెక్' గ్రూప్‌ను పరిచయం చేసింది, ఇది లింగ వైవిధ్యాన్ని పెంపొందించడానికి, సాంకేతిక విధులలో మహిళలకు సాధికారత కల్పించడానికి అంకితం చేయబడింది. అదనంగా, ఐడిసి భారతదేశంలోని వివిధ కళాశాలలతో భాగస్వామ్యం చేసుకోవటం ద్వారా టాలెంట్ పైప్‌లైన్‌ను వైవిధ్యపరిచే లక్ష్యంతో విస్తృత స్థాయి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
 
2023లో, ఐడిసి మొత్తంమీద యాప్‌లో అనుభవాలను మెరుగుపరచడం ద్వారా వినియోగదారు విలువ ప్రతిపాదనను గణనీయంగా మెరుగుపరిచింది. ఇందులో సెర్చ్ ఫంక్షనాలిటీ, ప్రమోషనల్ ఫీచర్‌లు, డెలివరూ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్, గిఫ్టింగ్ ఫంక్షనాలిటీని ప్రారంభించటం, కొత్త షాపింగ్ సర్వీస్,  మృదువైన రీతిలో చెల్లింపు పద్ధతులను చేయటం వంటివి ఉన్నాయి.
 
అంతే కాకుండా, డెలివరూ యొక్క యాప్‌లో ప్రకటనలను ప్రారంభించడంలో ఐడిసి సహాయం చేసింది, దీని ద్వారా వేలాది మంది భాగస్వాములు ప్రచారం చేయడానికి, తమ ప్రకటనలను చేయడానికి అనుమతించారు, ఇది ప్రపంచ వ్యాప్తంగా డెలివరూ యొక్క ప్రకటనల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి దారితీసింది. రైడర్ ఆన్‌బోర్డింగ్ ప్లాట్‌ఫారమ్‌ను పునరుద్ధరించడంలో ఐడిసి కీలకపాత్ర పోషించింది, దీని ఫలితంగా ఒక్కో రైడర్‌కు ఆన్‌బోర్డింగ్ ఖర్చులు గణనీయంగా తగ్గాయి, మిలియన్ల పౌండ్‌లను ఆదా చేసింది.
 
ఐడిసిలోని ఇంజినీరింగ్ డైరెక్టర్ చౌదరి వెనిగళ్ల మాట్లాడుతూ : “2023లో ఐడిసి సాధించిన ముఖ్యమైన విజయాల పట్ల మేము గర్విస్తున్నాము. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ,  వ్యూహాత్మక ప్రతిభ సముపార్జన మరియు నాయకత్వ సామర్థ్యాలను బలోపేతం చేయడం ద్వారా భారతదేశంలో మా బృందాన్ని విస్తరించడం లో  మా నిబద్ధత ఇమిడి ఉంటుంది. మా బృందం తాజా పరిశ్రమ పోకడలకంటే ముందుగా ఉండేలా ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలకు మరియు శిక్షణ కార్యక్రమాల అమలుకు మేము ప్రాధాన్యతనిస్తాము. మా మార్కెట్‌ప్లేస్, రైడర్‌లు, రెస్టారెంట్‌లు & దుకాణాలు మరియు వినియోగదారులు అన్ని వైపులా సామర్థ్యాన్ని పెంపొందించడంపై మా సాంకేతిక బృందం దృష్టి కొనసాగుతోంది " అని అన్నారు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

SSD 990 EVOను ఆవిష్కరించిన సామ్ సంగ్ రోజువారీ గేమింగ్