Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రపంచంలో అతిపెద్ద సోలార్‌ ట్రీ: సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ అంతర్జాతీయ రికార్డు

Advertiesment
ప్రపంచంలో అతిపెద్ద సోలార్‌ ట్రీ: సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ అంతర్జాతీయ రికార్డు
, సోమవారం, 14 మార్చి 2022 (23:58 IST)
సౌరశక్తి వినియోగం ప్రోత్సహించడమే లక్ష్యంగా సీఎస్‌ఐఆర్‌ యొక్క సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రపంచంలో అతిపెద్ద సోలార్‌ ట్రీని అభివృద్ధి చేసింది. దీనిద్వారా సౌర శక్తిని విద్యుత్‌ శక్తిగా మారుస్తారు. ఈ సోలార్‌ ట్రీని పంజాబ్‌లోని లుధియానాలో ఉన్న సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ ఫార్మ్‌ మెషినరీ వద్ద ఏర్పాటుచేశారు.

 
ఈ ట్రీని అధికారికంగా గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వద్ద  ప్రపంచంలో అతిపెద్ద సోలార్‌ ట్రీగా నమోదు చేశారు. మొత్తం సోలార్‌ పీవీ ప్యానెల్‌ సర్ఫేస్‌ ఏరియా 309.93 చదరపు మీటర్లుగా దీనిలో నమోదయింది. తద్వారా గతంలోని 67 చదరపుమీటర్ల రికార్డును అధిగమించింది. ఈ సోలార్‌ ట్రీ యొక్క ఇన్‌స్టాల్డ్‌ సామర్థ్యం 53.6 కిలోవాట్స్‌ పీక్‌గా ఉండటంతో పాటుగా రోజుకు 160-200 యూనిట్ల గ్రీన్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 
సీఎస్‌ఐఆర్‌-సీఎంఈఆర్‌ఐ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ (డాక్టర్‌) హరీష్‌ హిరానీ మాట్లాడుతూ, ‘‘ఈ సోలార్‌ ట్రీలో పలు వినూత్నమైన ఆవిష్కరణలు జోడించబడ్డాయి. అతిపెద్ద సోలార్‌ ట్రీగా గిన్నీస్‌ వరల్డ్‌రికార్డ్స్‌లో భాగం కావడమనేది ఖచ్చితంగా మా కీర్తిసిగలో మరో కలికితురాయిగా నిలుస్తుంది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన ప్రతి శాస్త్రవేత్తకూ అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది’’ అని అన్నారు.

 
ఆయనే మాట్లాడుతూ, ‘‘ఈ సోలార్‌ ట్రీలను విస్తృతశ్రేణిలో వినియోగించవచ్చు. ఈ-ట్రాక్టర్ల చార్జింగ్‌, ఈ-పవర్‌ టిల్లర్స్‌కు చార్జింగ్‌తో పాటుగా సాగునీటి అవసరాల కోసం వ్యవసాయ పంపుసెట్ల నిర్వహణ, వ్యవసాయ క్షేత్రాల వద్ద ఆహార తయారీ అవసరాలను తీర్చడం, వ్యవసాయ దిగుబడులకు అవసరమైన కోల్డ్‌ స్టోరేజీకి సైతం తగిన శక్తిని అందిస్తుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా అనే మహిషానికి కొమ్ములు విరగ్గొడతాం - మాటల తూటాలు పేల్చిన పవన్ కళ్యాణ్