నాన్ వెజ్ ప్రియులకు చికెన్ ధరలు దడ పుట్టిస్తున్నాయి. చికెన్ కొనాలంటేనే జనం హడలిపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో చికెన్ ధరలు 250 రూపాయలపైనే ఉంది. ఇక సండే వచ్చిందంటే చాలా ఈ ధర అమాంతం రూ.300 వరకు పెరుగుతోంది.
ఎప్పుడు వేసవిలో పెరిగే చికెన్ ధరలు..ఇప్పుడు వానాకాలంలోనూ భారీగా పెరిగింది. కరోనా నేపథ్యంలో పౌష్టికాహారం తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్న నేపథ్యంలో చికెన్ కు డిమాండ్ పెరుగుతోంది. దీంతో చికెన్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.
మార్కెట్లో డిమాండ్ పెరగడంతో చికెన్ వ్యాపారులు ధరలను విపరీతంగా పెంచేస్తున్నారు. దీంతో ప్రజలు చికెన్ కొనేందుకు జంకుతున్నారు. హోల్ సేల్ క్రయ విక్రయాలలో ధరలు బాగానే ఉన్నా.. రీటైల్‌లో కొనే వారికి మాత్రం జేబులు చిల్లు పడక తప్పడం లేదు.