Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూబ్లీహిల్స్‌లోని ప్రోస్ట్‌లో బుష్‌మిల్స్‌తో కలిసి ప్రత్యేక పార్టీని నిర్వహించిన చైతన్య అక్కినేని

Chaitanya Akkineni Hosts an Exclusive Party with Bushmills
, గురువారం, 21 డిశెంబరు 2023 (19:14 IST)
చైతన్య అక్కినేని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ప్రోస్ట్‌లో ప్రత్యేక పార్టీకి హోస్ట్‌గా వ్యవహరించారు. బుష్‌మిల్స్ సహకారంతో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమం, బుష్‌మిల్స్ యొక్క మహోన్నత వారసత్వం, ప్రఖ్యాత షోయు రూపొందించిన సున్నితమైన కలినరీ అనుభవంతో పాటు అసాధారణ వేడుకగా ఆవిష్కృతమైంది. ప్రోస్ట్, దాని ఆకర్షణీయమైన, సమకాలీన వాతావరణంతో, బుష్‌మిల్స్ మాయాజాలాన్ని అనుభవించడానికి సరైన నేపథ్యాన్ని ఏర్పరచింది. శతాబ్దాల సంప్రదాయంతో, బుష్‌మిల్స్ అత్యుత్తమ స్థానిక పదార్ధాలతో కాలానుగుణమైన పనితనం మిళితం చేసి, ప్రపంచంలోనే అత్యుత్తమ, పురాతన లైసెన్స్ కలిగిన డిస్టిలరీగా తాము ఎందుకు నిలిచామని మరోసారి రుజువు చేసింది. 
 
సినీ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి అయిన చైతన్య అక్కినేని ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా ఉన్నారు, బుష్‌మిల్స్ వారసత్వం, నైపుణ్యానికి తన ప్రశంసలను వ్యక్తం చేశారు. ఈ పార్టీకి కాంతి దత్, మీనాక్షి పమ్నాని, సుధా రెడ్డి, నమ్రతా సాధ్వానీ తదితరులు హాజరయ్యారు. చైతన్య అక్కినేని ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, "బుష్‌మిల్స్, షోయుతో ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సాయంత్రం హస్తకళ, సంప్రదాయం, జీవితంలోని అత్యుత్తమ విషయాలను పంచుకున్నందుకు సంతోషంగా ఉంది" అని అన్నారు
 
మోనికా ఆల్కోబెవ్‌లో నేషనల్ సేల్స్ డైరెక్టర్‌గా హేమంగ్ చందత్ మాట్లాడుతూ, “ఇది తమ బ్రాండ్‌ దృష్టి కేంద్రీకరించిన మార్కెట్. ఈ డైనమిక్ సిటీలో అసాధారణమైన విస్కీ అనుభవాన్ని అందించాలనే తమ నిబద్ధతను ఈ పార్టీ పటిష్టం చేస్తుంది” అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.351 కోట్ల నగదు.. రూ.2.80 కోట్ల ఆభరణాలు స్వాధీనం