Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిర్బంధ డిజిటలైజేషన్‌.. ఆన్‌లైన్‌ చెల్లింపులతో నరకం

ఇది తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన సమస్య కాదు. యావద్దేశంలో ఇప్పుడు 80 శాతం ఏటీఎంలు నగదు లేకుండా ఖాళీగా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో నిజంగానే డబ్బులు లేక జనం ఇబ్బంది పడగా, ఇప్పుడు డబ్బులుండి కూడా కేంద్ర ప్రభుత్వం బలవంతపు మంత్రసానిత్వం కారణంగా బ్యాం

నిర్బంధ డిజిటలైజేషన్‌.. ఆన్‌లైన్‌ చెల్లింపులతో నరకం
హైదరాాబాద్ , బుధవారం, 19 ఏప్రియల్ 2017 (05:32 IST)
ఇది తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన సమస్య కాదు. యావద్దేశంలో ఇప్పుడు 80 శాతం ఏటీఎంలు నగదు లేకుండా ఖాళీగా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో నిజంగానే డబ్బులు లేక జనం ఇబ్బంది పడగా, ఇప్పుడు డబ్బులుండి కూడా కేంద్ర ప్రభుత్వం బలవంతపు మంత్రసానిత్వం కారణంగా బ్యాంకులు వట్టిపోతున్నాయి. ఏటీఎంలు ఖాళీగా ఉంటున్నాయి. ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి.


ఎలాగైనా సరే దేశ ప్రజలను బలవంతంగా డిజిటలైజేషన్, ఆన్ లైన్ చెల్లింపుల వైపు నెట్టాలని కేంద్రం ఎంత ప్రయత్నించినప్పటికీ దేశ ప్రజలు ఈనాటికీ 90 శాతం నగదునే వాడుతున్నారని, ఆన్ లైన్ లావాదేవీలు పది శాతం మాత్రమే సాగుతున్నాయని తాజా సర్వే తేల్చి చెప్పింది. దీంతో మరిన్ని కఠిన చర్యల వైపు బ్యాంకులు మళ్లేలా కేంద్రం ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సమాచారం.. 
 
నగదు లావాదేవీలపై  దేశ ప్రజల మక్కువను ఎలాగైనా సరే మార్చి ఆన్‌లైన్‌ లావాదేవీలే 90 శాతం జరిగేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గత సంవత్సరం నవంబరులో పెద్ద నోట్ల రద్దుతో ఆన్‌లైన్‌లో రూ.800 కోట్ల లావాదేవీలు జరుగగా..ఈ ఏడాది దీన్ని మూడు రెట్లు పెంచాలని అంటే రూ.2500 కోట్ల లావాదేవీలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో అసలు డబ్బులే అందుబాటులో లేకుండా చేస్తోంది. చివరకు బ్యాంకులకు కూడా ఈ దిశగా ఆదేశాలు జారీ చేయడంతో.. అవి ఏటీఎంలను కుదించే పనిలో పడ్డాయి. మొదట మహానగరాలు.. తర్వాత నగరాలు.. పట్టణాల్లో ఏటీఎంలను బాగా తగ్గించేసి.. కొన్నాళ్లకు గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటిని నామమాత్రం చేయాలని నిర్ణయించాయి. 
 
ఇలాకాకుండా ఇందులో భాగంగా నగరాల్లో ఏటీఎంలను మూసేయడంతో పాటు.. ఉన్నవాటిలోనూ సరిపడా నగదు ఉంచకుండా.. ప్రజలు డిజిటల్‌ లావాదేవీలు చేయక తప్పనిసరి పరిస్థితిని కల్పిస్తున్నాయి. మున్ముందూ ఇదే పరిస్థితి ఉంటుందని బ్యాకింగ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో ఖాతాదారులకు బ్యాంకులకు వెళ్తుండగా.. అక్కడా అడిగినంత నగదు ఇవ్వడం లేదు. పెద్దమొత్తాలను ఆన్‌లైన్‌లో బదిలీ చేసుకోవచ్చని వచ్చిన ఖాతాదారులకు అవగాహన కల్పిస్తున్నారు. అలా చేసుకోలేమని చెబితే.. అవతలి వ్యక్తి ఖాతా వివరాలతో నెఫ్ట్‌ దరఖాస్తును తీసుకుని.. ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తున్నారు. అంతేకానీ పెద్దమొత్తంలో నగదు మాత్రం చేతికి ఇవ్వడం లేదు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ ఐటీ పరిశ్రమపై ట్రంప్ పిడుగుపాటు.. హెచ్-1బి నిబంధనలు కఠినతరం