అంతర్జాతీయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్‌గా భారతి ఎటర్‌ప్రైజెస్ అధిపతి సునీల్ మిట్టల్ ఎంపికయ్యారు. సుమారు వందేళ్ల చరిత్ర కలిగిన ఐసీసీకి ఛైర్మన్‌గా ఎన్నికైన మూడో భారతీయుడు మిట్టల్ కావడం విశేషం.
ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఛైర్మన్ టెర్రీ మెక్‌గ్రామ్ నుంచి మిట్టల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక నుంచి టెర్రీ ఐసీసీ గౌరవ ఛైర్మన్‌గా ఉంటారు. దీనిపై మిట్టల్ స్పందిస్తూ.. అత్యంత ప్రతిష్టాత్మక బిజినెస్ ఆర్గనైజేషన్‌కు ఛైర్మన్‌గా పనిచేసే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు.